జగన్ భుజం తట్టిన మోదీ..గంటకుపైగా చర్చకొచ్చిన అంశాలివే..

జగన్ భుజం తట్టిన మోదీ..గంటకుపైగా చర్చకొచ్చిన అంశాలివే..
x
Highlights

వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ టూర్‌లో బిజీబిజీగా గడిపారు. ఢిల్లీ టూర్ సందర్భంగా మోడీ, అమిత్ షాలతో భేటీ అయిన జగన్ ఏపీ అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర ఆర్థిక...

వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ టూర్‌లో బిజీబిజీగా గడిపారు. ఢిల్లీ టూర్ సందర్భంగా మోడీ, అమిత్ షాలతో భేటీ అయిన జగన్ ఏపీ అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను వివరించి కేంద్ర సహకారాన్ని కోరినట్లు పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఢిల్లీలో టూర్‌లో బిజీబిజీగా గడిపారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లిన జగన్ ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మోడీతో గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానిగా మరోసారి ఎన్నికైన మోడీకి జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో రాష్ట్ర సమస్యలను జగన్ ప్రస్తావించారు. విభజన హామీలను నెరవేర్చాలని, ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేయాలని మోడీని జగన్ కోరినట్లు తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. గంటలకు పైగా సాగిన భేటీలో రాష్ట్ర సమస్యలే ఎజెండాగా సాగింది.

మోడీతో భేటీ అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను జగన్ కలిశారు. అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిసిన జగన్ ఈ నెల 30న సీఎంగా విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. 30 నిమిషాల పాటు సాగిన ఇద్దరి మధ్య సమావేశంలో ఏపీ విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కేం‍ద్రం నుంచి సహాయసహకారాలు అందించాలని అమిత్‌షాను కోరారు.

అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్న జగన్‌కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనలు అందించారు. ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని జగన్‌ పేర్కొన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని పరిస్థితులు ప్రధానికి వివరించామన్నారు.

జగన్ తో భేటీ అనంతరం మోదీ ట్విట్టర్ లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ఎన్నికయిన జగన్ తో అద్భుత సమావేశం జరిగిందని ఆంధ్రా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిపామని ఆయన అన్నారు. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్‌లో బిజీ బిజీగా గడిపారు.





Show Full Article
Print Article
Next Story
More Stories