సినీ రంగంలో మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పట్లేదు‌.. ఇలాంటి హీరోయిన్లే ఎక్కువ: ప్రముఖ నటుడు

Submitted by arun on Mon, 06/11/2018 - 15:29
Ravikishan

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి గళం విప్పినప్పటి నుంచి ఈ అంశం గురించిన ప్రస్తావన కొనసాగుతూనే ఉంది. మహిళా నటులు పలువురు తమకు జరిగిన అన్యాయాన్ని బట్టబయలు చేశారు. అయితే, సినీ పరిశ్రమలో మహిళా నటులకే కాదు మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పట్లేదంటూ ‘రేసు గుర్రం’ సినిమా ద్వారా  టాలీవుడ్ కు  పరిచయమైన నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్ట్‌ కౌచింగ్‌ ఆడవారికే కాదు, మగవారికీ ఎదురవుతోందని ఆయన సంచలన కామెంట్ చేశారు. మగవారిని లైంగికంగా వేధించే హీరోయిన్ల సంఖ్య సినీరంగంలో ఎక్కువగాఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు, హిందీ, బోజ్‌పూరీ భాషలలో పలుసినిమాలలో రవికిషన్‌ నటించారు. ఈరంగంలో ఎంతో అనుభవమున్న రవికిషన్‌ మాటలు నమ్మాల్సిందేనని సినీజనాలు అంటున్నారు. కాకపోతే తనకు ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా? లేదా అన్నదిమాత్రం రవికిషన్‌ చెప్పలేదు.


 

English Title
Ravikishan Comments about Casting couch

MORE FROM AUTHOR

RELATED ARTICLES