భర్త పబ్‌జీ ఆడనివ్వలేదని.. ఆ భార్య ఏకంగా..

భర్త పబ్‌జీ ఆడనివ్వలేదని.. ఆ భార్య ఏకంగా..
x
Highlights

పబ్‌జీ గేమ్ ఇప్పడు డ్రగ్స్ కంటే డేంజర్‌గా మారింది. ఆ మాయదారి ఆటలో పడ్డ చిన్నారులు తల్లిదండ్రులతో పాటు బయట ప్రపంచానికి దూరం అవుతున్నారు. మద్యం,...

పబ్‌జీ గేమ్ ఇప్పడు డ్రగ్స్ కంటే డేంజర్‌గా మారింది. ఆ మాయదారి ఆటలో పడ్డ చిన్నారులు తల్లిదండ్రులతో పాటు బయట ప్రపంచానికి దూరం అవుతున్నారు. మద్యం, డ్రగ్స్, సిగరెట్స్‌ కన్నా ఇప్పుడు ఆ గేమ్ పేరు చెబితేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. అయితే సాధారణంగా పిల్లలు, యూత్ మొబైల్‌ గేమ్స్ ఆడుతుంటారు. పబ్‌జీ వచ్చాక చిన్నపెద్దా తారతమ్యం లేకుండా అందరూ పబ్జీలో మునిగిపోతున్నారు. ఇక దీంతో కొన్నిదేశాల్లో ఇప్పటికే ఈ గేమ్‌పై బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల యూఏఈలోని అజ్మన్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

ఓ 20ఏండ్ల యువతి నేరుగా అజ్మన్ పోలీసుల శాఖకు చెందిన సోషల్ సెంటర్‌కు వెళ్లి తన కట్టుకున్న భర్త తనను పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదని మాకు వెంటనే విడాకులు ఇప్పించండి అని కోరింది ఆ యువతి. దీంతో ఒక్కసారి పోలీసులు కంగుతిన్నారు. ఇంతలోనే తన భర్తకు ఫోన్ చేసి పోలీసు స్టేషన్ కి పిలిపించి మాట్లాడారు. తన స్వేచ్ఛను భర్త హరిస్తున్నాడని యువతి పోలీసులకు వివరించింది. దీనికి తన భర్త స్పందిస్తూ అదేం లేదండి ఆమె కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వర్తించాలనే అలా చేశానని భర్త సమాధానం ఇచ్చాడు. కాగా వీరిద్దరికీ సర్ది చెప్పేసరికి పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చినట్లేంది. మొత్తానికి పోలీసులు నచ్చజేప్పడంతో ఇరువురు తమ ఇంటికి వెళ్లిపోయారు. ఇలానే మరో తల్లి కూడా తన 13 ఏళ్ల కొడుకు పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యాడని ఫిర్యాదు చేసింది. కాగా ఆ గేమ్ ఆడకుండా లాక్ చేయడంతో ఇప్పడు ఆ కుర్రాడు తీవ్రమైన మానసిక క్షోభకు గురై మంచానపడ్డాడని అధికారులు వెల్లడించారు. ఓ గేమ్ వల్ల ఇన్ని తలనొప్పులు రావడం ఇదే తొలిసారంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories