టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రికి మాజీ ల సెగ...పదవి నుంచి...

టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రికి మాజీ ల సెగ...పదవి నుంచి...
x
Highlights

టీమిండియా చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలంటూ రవిశాస్త్రిపై రానురాను ఒత్తిడి పెరిగిపోతోంది. ఐదోర్యాంకర్ ఇంగ్లండ్ చేతిలో టాప్ ర్యాంకర్ టీమిండియా 4-1తో...

టీమిండియా చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలంటూ రవిశాస్త్రిపై రానురాను ఒత్తిడి పెరిగిపోతోంది. ఐదోర్యాంకర్ ఇంగ్లండ్ చేతిలో టాప్ ర్యాంకర్ టీమిండియా 4-1తో చిత్తుగా ఓడినందుకు చీఫ్ కోచ్ నైతిక బాధ్యత వహించాలని పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. టెస్ట్ తుదిజట్టు ఎంపికలో పొరపాట్లు, వ్యూహాత్మక తప్పిదాలకు కారణం చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాత్రమేనని భారత మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ తేల్చి చెప్పారు. ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయలు వేతనం అందుకొంటున్న చీఫ్ కోచ్ ఇక ఎంతమాత్రమూ మాటలతో మాయ చేయలేరని తనకు ఇష్టమైన క్రికెట్ వ్యాఖ్యానం కొనసాగించాలని సలహా ఇచ్చారు. భారతజట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరటానికి ముందే చీఫ్ కోచ్ పదవి నుంచి రవి శాస్త్రి తప్పుకోవాలని కోరారు. భారత మాజీ కెప్టెన్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ సైతం రవిశాస్త్రి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలంటే గతంలోనే కొరిన సంగతి తెలిసిందే. మరోవైపు రవిశాస్త్రి, కెప్టెన్ కొహ్లీ మాత్రం ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని గట్టిగా సమర్థించుకొంటున్నారు. తమ పరాజయాన్ని అంకెల్లో చూడవద్దని ప్రతిమ్యాచ్ లోనూ ఎంతగొప్పగా పోరాడామో గమనించాలని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories