సుధీర్‌తో పెళ్లిపై స్పందించిన రష్మి

Submitted by arun on Tue, 03/20/2018 - 14:27
tweet

ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయితే.. వారికి ఆఫ్ స్క్రీన్ లో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరగడం మామూలే. ఇప్పటివరకూ ఈ ట్రెండ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. దీన్ని కూడా ఇప్పుడు బుల్లితెర మీదకు తెచ్చేశారు ఓ జంట. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. పార్టిసిపెంట్ సుధీర్ బాబుల మధ్య ఏదేదో ఉందనే.. ఇంకేదో జరిగిపోతోందని అనే మాదిరిగా చాలానే హింట్స్ కనిపిస్తాయి. 

అటు స్కిట్స్ లోను.. ఇటు డైలాగ్స్ లోను వీరిద్దరికి లవ్వు అన్న మాదిరిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. నిజంగానే వీరిద్దరూ ప్రేమికులు అని జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. దీన్ని బేస్ చేసుకుని ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా ఓ షోలో ప్రముఖ యాంకర్ రష్మి, కమెడియన్ సుధీర్ పెళ్లి చేసుకున్నట్టుగా చూపించారు. అది నిజంగా నిజం కాదులెండి. కానీ అసలు నిజంగా పెళ్లైందా? లేదంటే ఫేకా? అన్న సందేహం ఇంకా నెటిజన్లలో కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ రష్మిని ట్విట్టర్‌లో నేరుగా అడిగేశాడు. ‘నిజమా లేదంటే ఫేకా? సుధీర్‌ని నువ్వు పెళ్లి చేసుకున్నావా.. లేదా? మాకు క్లారిటీ కావాలి’ అని రష్మికి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి రష్మి ‘షో చివరి వరకూ చూడండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది’ అని రిప్లై ఇచ్చింది.
 
దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఒకరేమో ‘మాకు నిజమే అనిపిస్తోంది మేడమ్. మీరు సుధీర్‌తో లవ్‌లో ఉన్నారనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. ‘చూశాకే క్లారిటీ రావట్లేదు నిజంగా చేసుకుని అలా కవర్ చేశారేమోనని’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘సుధీర్‌కి వచ్చిన కల నిజం అయితే బాగుంటుందని మేము దేవుడిని వేడుకుంటున్నాం’ అని ఇంకొకరు ఇలా వెల్లువలా కామెంట్స్ పెడుతున్నారు.

English Title
Rashmi respond Marriage with Sudigaali Sudheer

MORE FROM AUTHOR

RELATED ARTICLES