ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదు: రష్మీ

Submitted by arun on Mon, 04/02/2018 - 13:37
anchor Suicide

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు చెందిన యాంకర్ రాధికారెడ్డి ఆపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆమె మరణంపై పలువురు సినీ, టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందిస్తూ, ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన బాధలు తొలగిపోవని ట్వీట్ చేసింది. మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని చెప్పింది. 

ఆమెను ఎప్పుడూ కలవలేదని.. కానీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపింది. శారీరక విశ్లేషణే కాదు మానసిక విశ్లేషణ కూడా ముఖ్యం... మానసిక వైద్యుడిని కలిసినంత మాత్రాన మనం పిచ్చివాళ్లమైపోయినట్టు కాదు.. మానసిక ఒత్తిడే ఈ రోజుల్లో మనిషి ప్రాణాలు తీస్తోంది.. డిప్రెషన్‌ అనిపించినప్పుడు స్నేహితులతో, కుటుంబ సభ్యలతో మన బాధలు పంచుకోవాలి.. అంతేకానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. నిద్ర లేవగానే ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదని రష్మీ ట్వీట్‌లో పేర్కొంది.

English Title
rashmi gautam responds anchor suicide

MORE FROM AUTHOR

RELATED ARTICLES