సుధీర్‌ను పెళ్లి చేసుకో.. రష్మీ ఘాటు రిప్లై!

Submitted by arun on Fri, 06/22/2018 - 10:25
Rashmi

జబర్దస్త్ తో యాంకర్ గా రష్మీ, కమెడియన్ గా సుధీర్ బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ లో వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందనే అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్లుగానే వీరి మధ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా కెమిస్ట్రీ జరుగుతోందనే రూమర్స్ ఉన్నాయి. ఈ రూమర్స్ ని సుధీర్, రష్మీ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎలాంటి రూమర్స్ వచ్చినా వారి తరహాలోనే ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. వీరిమధ్య ప్రేమాయణం జరుగుతోందనే వార్తలపై రూమర్స్ సహజమే కదా అన్నట్లుగా గతంలో వీరి స్పందన ఉండేది. తాజగా సోషల్ మీడియాలో రష్మీకి చేదు అనుభవం ఎదురైంది. నెటిజన్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 

ఓ నెటిజన్ మీడియాలో రష్మీకి రష్మీకి సలహా ఇచ్చాడు. సుధీర్ ని పెళ్లి చేసుకో.. మీరిద్దరూ చూడచక్కనైన జంట. మీ కెరీర్ కోసం ఇద్దరూ బాగా కష్టపడుతున్నారు కూడా అని వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై యాంకర్‌ రష్మీ ఎంతో హుందాగా, ఘాటుగానూ సమాధానమివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘మేమిద్దరం (సుధీర్‌, నేను) మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని నీకెలా తెలుసు. స్క్రీన్‌ మీద చూసి నువ్వు అలా భావించి ఉంటావు. రీల్‌ లైఫ్‌.. రియల్‌ కాదని తెలుసుకో. వీక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రోగ్రామ్స్‌లో సరదాగా ఉంటాం. అంతేకానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది మాకు తెలుసు. మా ఇష్టం. మీ సలహాలు అక్కర్లేద’ని రష్మీ బదులిచ్చారు. ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇలాంటి సలహాలు ఇవ్వడం సరైంది కాదని, వారి వ్యక్తిగత జీవితాన్ని వారికి వదిలేయాలని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. అది కేవలం తన అభిప్రాయమేనని.. వాక్‌ స్వాతంత్ర్యపు హక్కును మాత్రమే వాడుకున్నట్లు ప్రసన్న కుమార్‌ మళ్లీ ట్వీట్‌ చేశాడు. అభ్యంతరకర విషయాలు మాట్లాడనంత వరకు ఎలాంటి సమస్య ఉండదన్నాడు.

English Title
Rashmi Gautam loses her cool!

MORE FROM AUTHOR

RELATED ARTICLES