మ‌హేష్ ట్వీట్‌.. ర‌షీద్ రిప్లై!

Submitted by arun on Sat, 05/26/2018 - 13:31
Mahesh Babu, Rashid Khan

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్వాలిఫయర్‌-2లో విజయం సాధించి ఐపీఎల్‌ ఫైనల్‌ చేరిందంటే అందుకు ప్రధాన కారణం రషీద్‌ ఖాన్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రషీద్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. దీంతో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో రషీద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్‌ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కూడా ర‌షీద్‌ను ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేశాడు. `హ్యాట్సాఫ్ ర‌షీద్ ఖాన్‌. అద్భుత‌మైన మ్యాచ్‌. ఆదివారం వ‌ర‌కు ఆగ‌లేక‌పోతున్నాను. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుకు నా అభినంద‌న‌లు. గో ఆరెంజ్ ఆర్మీ.. ఎస్ఆర్‌హెచ్‌` అంటూ ట్వీట్ చేశాడు. మ‌హేష్ చేసిన ఈ ట్వీట్‌కు ర‌షీద్ స్పందించాడు. `ధ‌న్య‌వాదాలు బ్ర‌ద‌ర్. మీ సినిమాలన్నీ చూస్తున్నాను` అంటూ ర‌షీద్ స‌మాధానం ఇచ్చాడు.
 

English Title
rashidkhan maheshbabu twitter conversation

MORE FROM AUTHOR

RELATED ARTICLES