logo

ముథోల్‌లో అరుదైన ఘటన

నిర్మల్ జిల్లా ముథోల్‌లో ఇద్దరు అభ్యర్థులు ఎదురైన వేళ అరుదైన ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి రమాదేవి, ఎన్‌సీపీ అభ్యర్థి నారాయణరావు పటేల్ ప్రచారంలో భాగంగా ఎదురెదురు పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి రమాదేవి తనను ఆశీర్వదించాలంటూ ఆయన పాదాలకు వందనం చేశారు. ఒక్కసారిగా అవాక్కైన నారాయణరావు పటేల్ పెద్ద మనస్సు చేసుకుని ఆమెను దీవించారు. సాధారణంగా ఇద్దరు ప్రత్యర్థులు ఎదురైతే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. కానీ, అక్కడ జరిగిన సంఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్దలను గౌరవించాలన్న రమాదేవి కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంది.

లైవ్ టీవి

Share it
Top