టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

Submitted by arun on Fri, 04/20/2018 - 11:55
rangasthalam

బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం జైత్ర యాత్ర కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 1980 నాటి పల్లెటూరి కథతో సుకుమార్ మ్యాజిక్ చేశాడు. రాంచరణ్ తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేశాడు. సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి వంటి ఆకట్టుకునే నటన కనబరచడంతో రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.

లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ల్లెటూరి నేప‌థ్యంగా తెర‌కెక్కిన చిత్రం రంగ‌స్థ‌లం. రామ్ చ‌ర‌ణ్ ,స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 30న విడుద‌లైంది. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక ఓవ‌ర్సీస్‌, ఆస్ట్రేలియాల‌లో ఈ మూవీకి మాంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌ల ప‌ర్‌ఫార్మెన్స్, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం, ర‌త్న‌వేలు కెమెరా ప‌నిత‌నం, చంద్ర‌బోస్ లిరిక్స్ సినిమాకి అఖండ విజ‌యాన్ని అందించాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్స్‌తో సునామి సృష్టిస్తున్న రంగ‌స్థ‌లం చిత్రం 4వ వారానికి గాను 180 కోట్ల కలెక్ష‌న్స్ సాధించింది. నాన్ బాహుబ‌లి చిత్రంగా టాలీవుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన తొలి చిత్రం రంగ‌స్థ‌లం అని అంటున్నారు. రానున్న రోజుల‌లో ఈ చిత్రం మ‌రిన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. అన‌సూయ‌, ప్ర‌కాశ్ రాజ్, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే.

English Title
rangasthalam creates new record

MORE FROM AUTHOR

RELATED ARTICLES