ఇద్దరు బిడ్డల తల్లినైతే నటించకూడదా?: అనసూయ

Submitted by arun on Mon, 04/16/2018 - 13:37
Anasuya

బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రేక్షకులకు ‘రంగమ్మత్త’ అయిపోయారు. ‘రంగస్థలం’ సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు మంచి స్పందన వస్తోంది. అయితే అనసూయను ఇద్దరు బిడ్డలకు తల్లివి... హాట్‌ యాంకర్‌‌లా టీవీల్లో కనిపించడం, ఐటమ్‌ సాంగ్స్‌ చెయ్యడం నీకు అవసరమా అని చాలామంది నెటిజన్లు నన్ను విమర్శిస్తున్నారట. ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు నటించకూడదా? అంటూ ప్రశ్నిస్తోంది. బాలీవుడ్‌లో పెళ్లై పిల్లలున్న తారలు ఇప్పటికీ తెరపై అలరిస్తున్నారు. ఒక్క తెలుగు కథానాయికలపైనే ఈ విమర్శలు. ఒకప్పటి అగ్ర తారలైన భానుమతిగారు, సావిత్రిగారు పెళ్లయిన తర్వాత కూడా కెరీర్‌ను అద్భుతంగా సాగించారని విన్నాను, చాలా చోట్ల చదివాను. అప్పుడులేని విమర్శలు ఇప్పుడు ఎందుకు? వైవిధ్యమైన పాత్రలు దక్కినప్పుడు చేస్తే తప్పేంటి?’’ అని అనసూయ చెప్పుకొచ్చింది.
 

English Title
Rangammatta made Anasuya Bharadwaj popular

MORE FROM AUTHOR

RELATED ARTICLES