బట్టలిప్పితేనే యాక్టింగ్‌ నేర్పిస్తా...

బట్టలిప్పితేనే యాక్టింగ్‌ నేర్పిస్తా...
x
Highlights

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ముసుగులో యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న డైరెక్టర్ గుట్టు రట్టు చేసిందో యువతి. బట్టలు విప్పితే నటన నేర్పిస్తానంటున్న...

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ముసుగులో యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న డైరెక్టర్ గుట్టు రట్టు చేసిందో యువతి. బట్టలు విప్పితే నటన నేర్పిస్తానంటున్న ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వర్మ బండారాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ లోని సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఉన్న సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ కు వినయ్ వర్మపై ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బాధిత యువతితో పటు మరికొందరు యువతులు ఇటీవల ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరగా డైరెక్టర్ వినయ్ వర్మ అందర్నీ బట్టలు విప్పమని ఆదేశించాడు. యువతులతో పాటు యువకులూ బట్టలు విప్పాలన్నాడు. దీంతో షాక్ అయిన బాధిత యువతి బట్టలు విప్పడానికి నిరాకరించింది.

ఇనిస్టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిక్షణ పేరుతో యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్న శిక్షణ సంస్థ నిర్వాహకుడు వినయ్ వర్మను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. శిక్షణ పేరుతో మోసపోవద్దని ఆమె యువతులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు నటనలో పై దుస్తులు తీసేయడం కామన్ అని సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ వర్మ చెబుతున్నాడు. యాక్టింగ్ పై ఆసక్తి లేకపోవడంతోనే ఆరోపణలు చేస్తుందని అంటున్నాడు. ఇక అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న వినయ్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ని మూసివేయాలన్నారు. బాధిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువతుల్ని వేధిస్తున్న యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories