జగన్ రికార్డు మెజార్టీ...అత్యల్పంగా 25 ఓట్ల తేడాతో...

జగన్ రికార్డు మెజార్టీ...అత్యల్పంగా 25 ఓట్ల తేడాతో...
x
Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు రాష్ర్టంలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. తన సమీప ప్రత్యర్ధిపై 90 వేల 110 ఓట్ల...

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు రాష్ర్టంలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. తన సమీప ప్రత్యర్ధిపై 90 వేల 110 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ఏడు నియోజకవర్గాల్లో వందలోపు ఓట్ల తేడాతో అభ్యర్ధులు గెలుపొందగా 20 వేల నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో 79 మంది అభ్యర్ధులు గెలిచారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణు అత్యల్పంగా 25 ఓట్ల తేడాతో గెలుపొందారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి అఖండ మెజార్టీ సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సతీష్‌రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. మొత్తం నియోజకవర్గంలో 2,23,411 మంది ఓటర్లు ఉండగా 1,80,663 ఓట్లు పోలయ్యాయి. వీటిలో జగన్‌కి1,32,356 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి సతీష్‌కుమార్‌రెడ్డికి 42,246 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో గెలుపొందిన అభ్యర్ధులందరిలోనూ మెజార్టీ సాధించి జగన్ రికార్డు సృష్టించారు.

50 వేలకు పైగా ఆధిక్యం సాధించినవారిలో జగన్ తో పాటు మరో ఐదుగురు వైసీపీ అభ్యర్ధులు ఉన్నారు. గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు 81,035, సూళ్లూరు పేట నుంచి కిల్లివెటి సంజీవయ్య 61,292, అన్నపర్తి నుంచి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి 55,207, కడప నుంచి అంజాద్ బాషా 54,794, జమ్మలమడుగు నుంచి ఎం.సుధీర్ రెడ్డి 51,641 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

ఇక వంద నుంచి వెయ్యి లోపు ఓట్లతో ముగ్గురు అభ్యర్ధులు గెలిచారు. వారిలో వైసీపీ, టీడీపీ, జనసేన నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డికి 708, రాజోలులో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద రావు 814, గన్నవరంలో టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీకి 838 ఓట్ల ఆధిక్యం లభించింది. అత్యల్పంగా 25 ఓట్ల తేడాతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు విజయం సాధించారు.

మూడు వేల లోపు ఓట్లతో ఎనిమిది మంది అభ్యర్ధులు విజయం సాధించారు. ప్రకాశం జిల్లా కొండెపి నుంచి టీడీపీ అభ్యర్ధి వీరాంజనేయ స్వామి 1,024, పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్ధి కిలారి వెంకట రోశయ్య 1,112, పర్చూరు నుంచి టీడీపీ అభ్యర్ధి వై.సాంబశివరావు 1,647 ఓట్ల ఆధిక్యం సాధించారు. విశాఖపట్నం తూర్పు నుంచి టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు 1,944, నెల్లూరు వైసీపీ అభ్యర్ధి అనిల్ కుమార్ 1988, అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్ 2132, తణుకు నుంచి వైసీపీ అభ్యర్ధి కె.వెంకట నాగేశ్వర్ రావు 2,195 , నగరి నుంచి వైసీపీ అభ్యర్ధి రోజా 2708 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు అత్యధిక మెజార్టీ సాధించగా అత్యల్ప మెజార్టీతో ఐదుగురు గట్టెక్కారు.

Show Full Article
Print Article
Next Story
More Stories