పదేళ్ల తర్వాత.. మళ్లీ రొమాన్స్ చేయబోతున్నారట

పదేళ్ల తర్వాత.. మళ్లీ రొమాన్స్ చేయబోతున్నారట
x
Highlights

రామ్.. ఎనర్జిటిక్ హీరో. కాజల్.. వయసు మీద పడుతున్నా తరగని అందాన్ని మెయింటైన్ చేస్తున్న బ్యూటీ. ఈ ఇద్దరి కాంబోలో.. 2009లో గణేష్ అనే సినిమా వచ్చింది....

రామ్.. ఎనర్జిటిక్ హీరో. కాజల్.. వయసు మీద పడుతున్నా తరగని అందాన్ని మెయింటైన్ చేస్తున్న బ్యూటీ. ఈ ఇద్దరి కాంబోలో.. 2009లో గణేష్ అనే సినిమా వచ్చింది. తర్వాత.. కాజల్ బిజీ అయిపోయింది. రామ్ మాత్రం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతూ ఈ మధ్యనే కెరీర్ లో కుదురుకుంటున్నాడు. సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధించడంపై దృష్టి పెడుతున్నారు.

తాజాగా.. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాకు రామ్ కమిట్ అయ్యాడు. సొంత సంస్థ.. స్రవంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. దీనికి.. కాజల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. గణేష్ లో రామ్ కాజల్ జంట.. బానే కనిపించింది. ఇప్పుడు ట్రెండ్ కు తగినట్టుగా.. మరోసారి ఇద్దరూ మ్యాజిక్ చేస్తారని సినిమా యూనిట్ నమ్ముతోంది.

థ్రిల్లింగ్, అడ్వెంచరస్, లవ్ స్టోరీగా ప్రవీణ్ సత్తారు.. ఈ స్టోరీని రెడీ చేశాడట. టాలీవుడ్ నుంచి అడ్రస్ గల్లంతైందని కన్ఫమ్ అయ్యే దశలో.. రాజశేఖర్ ను ఒడ్డున పడేసిన ప్రవీణ్ సత్తారు.. ఇప్పుడు రామ్ కు గరుడవేగకు మించిన హిట్ అందించేందుకు కసరత్తు చేస్తున్నాడట.

Show Full Article
Print Article
Next Story
More Stories