నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలిచినప్పుడు.. ఈవీఎంలపై బాబు ఎందుకు మాట్లాడ్లే: జగన్

నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలిచినప్పుడు.. ఈవీఎంలపై బాబు ఎందుకు మాట్లాడ్లే: జగన్
x
Highlights

2014లో ఇవే ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు ఓడిపోతే ఆ ఈవీఎంలపై నెపం నెడుతారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌...

2014లో ఇవే ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు ఓడిపోతే ఆ ఈవీఎంలపై నెపం నెడుతారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచినప్పుడు చంద్రబాబు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రజల తీర్పును అవహేళన చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. ఈవీఎంలపై ఫిర్యాదులు చేస్తున్నది కేవలం చంద్రబాబు మాత్రమే తప్ప, ప్రజలు కాదని జగన్ తెలిపారు. 80 శాతం మంది ఓటు వేసి, తాము ఎవరికి ఓటు వేశామో వీవీ ప్యాట్ లో చూసుకుని సంతృప్తి చెందారంటున్న జగన్‌. చంద్రబాబు మాత్రం తాను ఎవరికి ఓటు వేసిందీ తనకు తెలియడం లేదని సినిమా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓ విలన్ మాదిరి ఈసీని ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ ఏజంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు కూడా ఏ విధమైన ఫిర్యాదులూ లేవని అన్నారు. ఈవీఎంలలో లోపాలుంటే, దాదాపు 40 వేలకు పైగా ఉన్న పోలింగ్ బూత్ లలో ఉన్న టీడీపీ ఏజంట్లు ఎందుకు ప్రశ్నించలేదని జగన్‌ నిలదీశారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఇనుమెట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి కోడెల వెళ్లి, లోపల అధికారులు ఉండగానే, తలుపులు బిగించుకున్నారని, ఈ విషయం రికార్డెడ్ గా ఉందన్నారు. అక్కడున్న సాధారణ ఓటర్లు ఆయన వైఖరిని ప్రశ్నిస్తే, తనంతటతానుగా బట్టలు చించుకుని బయటకు వచ్చి డ్రామాలు ఆడారని జగన్ ఆరోపించారు. కోడెల ఇంత చేస్తే, అదేమీ నేరం కాదన్నట్టు ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మద్దతుదారులపై టీడీపీ గూండాలు దాడులకు దిగుతున్నారని, ఇదే విషయాన్ని తాను గవర్నర్ కు ఫిర్యాదు చేశానని జగన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories