గెలుపు ఓటముల్లో కీలకం కానున్న పోస్టల్ బ్యాలెట్స్...కౌటింగ్ గడువు సమీపిస్తున్నా...

గెలుపు ఓటముల్లో కీలకం కానున్న పోస్టల్ బ్యాలెట్స్...కౌటింగ్ గడువు సమీపిస్తున్నా...
x
Highlights

నువ్వానేనా అన్న స్థాయిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తుండగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి పడ్డాయన్నది అందరిలో...

నువ్వానేనా అన్న స్థాయిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తుండగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి పడ్డాయన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఎంత మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు ఎటు మొగ్గు చూపారు అభ్యర్ధుల తలరాతను మార్చే విధంగా తీర్పు ఉంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కీలకం కానున్న పోస్టల్ బ్యాలెట్ల తీరును ఓసారి చూద్దాం.

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ గడువు సమీపిస్తున్నా తూర్పుగోదావరి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్లు పూర్తిగా చేరలేదు. మూడు పార్లమెంట్, 19 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ విధుల్లో పాల్గొన్న 60 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా 42,145 పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే ఓటేసిన తర్వాత రిటర్నింగ్ అధికారులకు అందాయి. వీటిలో పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్లు 19,418, అసెంబ్లీకి సంబంధించి 21,727 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. మరో 8 వేల మందికి పైగా ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్స్ అందించాల్సి ఉంది.

పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని కొందరు ఉంటే..రాజకీయ పార్టీలు తమను ఓట్లు వేయమని అడిగితే వేద్దాంలే అన్న ధోరణిలో కొందరు ఉన్నారు. మరికొందరు తమకు పోస్టల్ బ్యాలెట్లు అందలేని కూడా ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు. సాధారణ ఓటర్లకు ఎర చూపినట్టుగానే పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్ధులు తాయిలాలు అందించారనే ప్రచారం జోరుగుగా సాగుతోంది.

కౌంటింగ్ రోజుకు 8 గంటల కంటే ముందు చేరితేనే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. నువ్వా నేనా అనే విధంగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నేతలు ఉద్యోగుల ఓట్లపై దృష్టి సారించారు. కొందరు అభ్యర్ధులు అనుచరులు రంగంలోకి ఉద్యోగులను ప్రలోభాలకు కూడా గురి చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ఉద్యోగులు ఎవరివైపు మొగ్గు చూపారో ముందుగానే తేలుతాయని అంచనా వేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories