శ్రీదేవిపై వర్మ.. మరోసారి!

Submitted by arun on Sat, 03/03/2018 - 09:30
Sridevi's biopic

అందాల తార శ్రీదేవి చనిపోయినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శించుకుంటూనే ఉన్నాడు. వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాను దాటి.. శ్రీదేవిపై తన అభిమానాన్ని సిల్వర్ స్క్రీన్ పై కూడా చూపించే పనిలో వర్మ పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు.. ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే.. శ్రీదేవి వ్యక్తిగత జీవితం గురించి రకరకాలుగా ప్రస్తావనలు చేసి విమర్శల పాలైన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తుండడంతో.. ఇది మరో వివాదంగా మారే అవకాశం ఉంది. శ్రీదేవి గురించి వర్మ సినిమా తీయడం అంటే.. కచ్చితంగా సంచలనాత్మక విషయాలు ఎన్నో ఉంటాయని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. త్వరలోనే సినిమాపై వర్మ క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే.. ప్రస్తుతానికి సినిమా కథను ఫైనల్ చేసే పనిలో వర్మ ఉన్నట్టుగా తెలుస్తోంది. అది పూర్తి కాగానే.. అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం అందుతోంది. పూర్తి క్లారిటీ రావాలంటే.. మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

English Title
Ram Gopal Varma to make Sridevi's biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES