ఎవరికీ మోదం .. ఎవరికీ ఖేదం .. త్వరలోనే టీఆర్ఎస్ పూర్తిస్థాయి కేబినేట్ ..

ఎవరికీ మోదం .. ఎవరికీ ఖేదం .. త్వరలోనే టీఆర్ఎస్ పూర్తిస్థాయి కేబినేట్ ..
x
Highlights

ఇప్పుడు తెలంగాణాలో ఎన్నికల కోలాహలం అయిపొయింది . ఇప్పుడు పాలన పై పూర్తిస్థాయి పోకస్ చేసేందుకు తెలంగాణా సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు .. ఇపుడున్న...

ఇప్పుడు తెలంగాణాలో ఎన్నికల కోలాహలం అయిపొయింది . ఇప్పుడు పాలన పై పూర్తిస్థాయి పోకస్ చేసేందుకు తెలంగాణా సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు .. ఇపుడున్న మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తూ పలుశాఖల మార్పుతో పాటు పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై చర్చ ఉంటుందని టీఆర్ఎస్ లో చర్చ జోరుగా నడుస్తుంది ..

రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ మరియు మహ్మద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేసారు . నెల తర్వాత ఓ మినీ కేబినేట్ ని ఏర్పాటు చేసారు కేసీఆర్ .. ఇక ఇప్పుడు పూర్తిస్థాయి కేబినేట్ ఉంటుందని ఇందులో ఎవరికీ చోటు దక్కనుంది అన్నదానిపై హై టేంక్షన్ మొదలయింది . అయితే గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుకున్నన్ని స్థానాలు గెలుచుకోలేకపోయింది . అయితే ఓడిపోయినా స్థానాల్లో ఇంచార్జ్ గా ఉన్న మంత్రులుపై వేటు పడే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తుంది .

ఇక కొత్త మంత్రివర్గంలో మాజీ ఎంపీ కవితకు ఛాన్స్ దక్కే అవకశం ఉన్నట్లు తెలుస్తుంది . ఇక టీఆర్ఎస్ ట్రబుల్ షుటర్ హరీష్ రావుని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని సమాచారం.. గతంలో మంత్రులుగా పనిచేసిన కేటిఆర్ ,జోగు రామన్న , కడియం శ్రీహరి , లక్ష్మారెడ్డి , మహేందర్ రెడ్డి జరగబోయే కేబినేట్ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . జిల్లాలు, సామజీకవర్గాలు ,సీనియారిటీని బట్టి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చునని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు . దీనిపైన జూన్ రెండోవారంలో ఓ క్లారిటీ రానుంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories