రకుల్.. అక్కడ నెగ్గి.. ఇక్కడ తగ్గుతోంది

Submitted by arun on Mon, 03/12/2018 - 14:49
Rakul Preet Singh

ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు.. అని పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేదిలోని డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ సూత్రాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అక్షరాలా పాటిస్తోంది. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని కూడా ఒంటబట్టించుకున్న ఈ భామ.. అవకాశాలు ఎక్కువగా ఉన్నచోట పారితోషికాన్ని పెంచేస్తూ.. అవకాశాలు తక్కువగా ఉన్న దగ్గర రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందని తెలుస్తోంది.

ఈ మధ్య.. టాలీవుడ్ లో రకుల్ కు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. కానీ.. కోలీవుడ్ లో కార్తీతో ధీరన్ అధికారం ఒండ్రు సినిమా విజయం సాధించడం.. అక్కడ రకుల్ దశను మార్చేసింది. తర్వాత.. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్యతో రకుల్ రొమాన్స్ చేస్తోంది. ఇప్పుడు మరోసారి కార్తీ సినిమాలో అవకాశం దక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. పెరిగిన డిమాండ్ ప్రకారం.. తనకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందిగా కూడా రకుల్ డిమాండ్ చేస్తోందట.

రకుల్ కు ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకుంటున్న నిర్మాతలు కూడా అందుకు దాదాపుగా ఓకే అనేస్తున్నారట. దీంతో.. రకుల్ ఎంతంటే అంత అన్నట్టుగా పరిస్థితి తయారైందట. కానీ.. టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు తగ్గడంతో.. ఇక్కడ రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి కూడా సిద్ధమే అని రకుల్ సిగ్నల్స్ పంపిస్తున్నట్టు టాక్. దీంతో.. నెగ్గడం.. తగ్గడం అన్న ఈక్వేషన్ ను రకుల్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తోందన్న కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి.

English Title
Rakul's master plan to grab films

MORE FROM AUTHOR

RELATED ARTICLES