పెళ్లికొడుకు లేకుండా బారాత్‌ చేస్తున్నట్లుంది..: కాంగ్రెస్ పై రాజ్‌నాథ్ వ్యగ్యాస్త్రం

Submitted by chandram on Wed, 11/21/2018 - 19:42
raj


కాంగ్రెస్ పై మరోసారి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ పెళ్లి తరువాత పెళ్లికొడుకు లేకుండా చేసే ఉరేగింపులా కాంగ్రెస్ వ్యవహారం ఉందని వ్యాగ్యాస్త్రం విసిరారు. కాంగ్రెస్‌కు తల,తోక లేదని, సరైన న్యాయకత్వం లేదని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మునిగితెలుతుంటే కాంగ్రెస్ మాత్రం బీజేపీకి ధీటుగా అభ్యర్థులను ప్రకటించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అన్నారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించకపోవడంతో రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. రానున్న ఎన్నికల్లో  మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో తిరిగి స్పష్టమైన మెజారిటీతో  బీజేపీ అధికార పగ్గలు చేపట్టడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. 2033 కల్లా భారత్‌ మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అన్నారు. 

English Title
Rajnath Singh fire on congress party

MORE FROM AUTHOR

RELATED ARTICLES