రజనీకాంత్‌ ఇంట్లో విషాదం

Submitted by arun on Tue, 09/04/2018 - 11:14
rajini

సౌతిండియా సూపర్ స్టార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్న సత్యనారాయణన్ భార్య కళావతీ బాయి (70) బెంగళూరులో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్, ఆమెను కడసారి చూసేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. రజనీకాంత్‌ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నయ్య సత్యనారాయణన్, వదిన కళావతి వద్దే పెరిగారు. రజనీకాంత్‌ను చెన్నైకి పంపి, నటుడయ్యే వరకూ ఆయన బాగోగులు అన్నయ్య వదినలే చూసుకున్నారు. ఇదిలాఉండగా రజనీకాంత్‌ వదిన కళావతిబాయి గత కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. బెంగళూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వైద్యం ఫలించక ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.

English Title
Rajinikanth's close relative passes away

MORE FROM AUTHOR

RELATED ARTICLES