వర్షం వస్తోందని బండరాయి చాటున నిలబడితే...

వర్షం వస్తోందని బండరాయి చాటున నిలబడితే...
x
Highlights

భారీ వర్షం వస్తుందని తలదాచుకోవాడానికి రోడ్డు పక్కన ఉన్న గ్రానైట్‌ వ్యర్థపు రాయి పక్కన నిలబడ్డాడు అంతే మృత్యువు కాటేసింది. ఇక వివరాల్లోకి వెళితే...

భారీ వర్షం వస్తుందని తలదాచుకోవాడానికి రోడ్డు పక్కన ఉన్న గ్రానైట్‌ వ్యర్థపు రాయి పక్కన నిలబడ్డాడు అంతే మృత్యువు కాటేసింది. ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మద్దిరాలలోని వినుకొండ పట్టణం అంబేద్కర్‌ కాలనీకి చెందిన పోలా కోటయ్య తనకు పిల్లను ఇచ్చిన మామా ఇంటికి తన ద్విచక్రవాహనంపై వచ్చాడు. వారితో సరదాగా గడిపి తిరుగుప్రయాణమయ్యాడు పోలా కోటయ్య. అయితే చిలకలూరిపేట మంచినీటి చెరువు రహదారి నుంచి కమ్మవారిపాలెం మద్దిరాల మార్గం నుండి వెళ్తున్నాడు అయితే ఒక్కసారిగా ఉన్నట్టుండి భారీ వర్షం మొదలైంది. దీంతో కోటయ్య తలదాచుకునేందుకు బైకును పక్కకు పెట్టి రోడ్డు పక్కన ఉన్న గ్రానైట్‌ వ్యర్థపు రాయి నిలుచుకున్నాడు. అయితే వర్షాని మెళ్లి మెళ్లిగా వర్షానికి కింద ఉన్న మట్టి కరిగి ఆ రాయి కాస్తా పోలా కోటయ్య పైన పడింది. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు వీడిచాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థాలికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories