జగన్ ప్రమాణ స్వీకారానికి పవన్ ..

జగన్ ప్రమాణ స్వీకారానికి పవన్ ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కి రెండో ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిన విషయమే .. ఇప్పటికే ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి కేసీఆర్ ,...

ఆంధ్రప్రదేశ్ కి రెండో ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిన విషయమే .. ఇప్పటికే ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి కేసీఆర్ , మోడీ , స్టాలిన్ ని అహ్వానించారు జగన్ .. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ అపదర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా అహ్వనించారు జగన్ .. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులను ఆహ్వానించామని పార్టీ నాయకులు తెలిపారు. జగన్ ప్రమాణ స్వీకార వేడుకకు పవన కళ్యాణ్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జగన్, పవన్ మీడియా సమక్షంలో ఒకరికొకరు ఎదురు పడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories