బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిక

Submitted by nanireddy on Wed, 11/14/2018 - 20:25
rajasthan-bjp-mp-harish-chandra-meena-mla-habeebur rehman-joins-congress

ఎన్నికల వేళా బీజేపీకి భారీ షాక్ తగిలింది. రాజస్థాన్ బీజేపీ దౌసా ఎంపీ హరీష్ చంద్ర మీనా ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే ప్రస్తుతం రాజస్థాన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా  ఉన్న హబీబుర్ రెహ్మాన్  బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. అజ్మీర్ ఎంపీ రఘు శర్మ, ఇతర నేతల సమక్షంలో జైపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెహ్మాన్‌ ఆ పార్టీ తీర్ధం తీసుకున్నారు.  మొదట కాంగ్రెస్ ద్వారానే  రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రెహ్మాన్ పదేళ్ల కిందట బీజేపీలో చేరారు. అయితే అనూహ్యంగా  తిరిగి  కాంగ్రెస్ గూటికి చేరారు. గతంలో రెహ్మాన్.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో 2008లో ఆయన బీజేపీలో చేరారు. తాజాగా ఆయన మరోసారి కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.

English Title
rajasthan-bjp-mp-harish-chandra-meena-mla-habeebur rehman-joins-congress

MORE FROM AUTHOR

RELATED ARTICLES