చరణ్, తారక్ పాలిట విలన్ గా రాజశేఖర్?

చరణ్, తారక్ పాలిట విలన్ గా రాజశేఖర్?
x
Highlights

దర్శక ధీరుడు.. జక్కన్న రాజమౌళి తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చింది కానీ.. పూర్తి వివరాలు మాత్రం ఒక్కోటిగా బయటికి వస్తూ హైప్ పెంచేస్తున్నాయి. డీవీవీ...

దర్శక ధీరుడు.. జక్కన్న రాజమౌళి తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చింది కానీ.. పూర్తి వివరాలు మాత్రం ఒక్కోటిగా బయటికి వస్తూ హైప్ పెంచేస్తున్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అన్నాదమ్ములుగా నటిస్తున్నారని.. బాక్సింగ్ ప్లేయర్లుగా కనిపించనున్నారని గుసగుసలు ఇప్పటికే వినిపిస్తుండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటికొచ్చింది.

మామూలుగా రాజమౌళి సినిమాల్లో విలన్ కు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. హీరోతో సమానంగా విలన్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం జక్కన్న స్పెషాలిటీ. కొత్త ప్రాజెక్టులో కూడా అలాంటిదే ఓ డిఫరెంట్ ప్లాన్ చేస్తున్నారట. విలన్ క్యారెక్టర్ కు యాంగ్రీ ఓల్డ్ మన్ రాజశేఖర్ ను తీసుకోవాలని చూస్తున్నారట. రాజమౌళి మనసులో ఏదైనా కేరెక్టర్ కు ఎవరైనా నటుడిని అనుకున్నారంటే.. వెంటనే సంప్రదించడం.. రాజమౌళి సినిమా కాబట్టి సదరు నటుడు ఓకే చెప్పేయడం కూడా మామూలే.

దీంతో.. ఇప్పటికే రాజశేఖర్ ను జక్కన్న సంప్రదించాడనీ.. రాజశేఖర్ కూడా ఆసక్తిగా ఉన్నాడనీ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకుండానే.. అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం అని ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories