చంద్ర‌బాబు ఎవ‌రంటే

Submitted by lakshman on Tue, 04/03/2018 - 03:15
Rajasekhar to Play the role of Chandrababu Naidu in NTR Biopic

స్వ‌ర్గీయ నంద‌మూరి ఎన్టీ రామారావు బ‌యోపిక్ సినిమా హ‌ట్ట‌హాసంగా ప్రారంభమైంది. బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్ర‌ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఉప‌రాష్ట్ర‌పతి వెంక‌య్య‌నాయుడు  నాచారంలోని రామ‌కృష్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర స‌న్నివేశానికి క్లాప్ కొట్టి సినిమాను షూటింగ్ ను ప్రారంభించారు .  ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గా బాల‌కృష్ణ‌,  అల్లుడు చంద్రబాబుగా ఎవ‌రు చేస్తారు. ఎన్టీఆర్ నిజ‌జీవితంలో కీల‌క పాత్ర‌పోషించిన నాదెండ్ల విజ‌య భాస్క‌ర్ పాత్ర‌ను ఎవ‌రు పోషించ‌నున్నారు అనే విష‌యాల‌పై సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 
ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంపై చాలా కేర్ తీసుకుంటున్న డైర‌క్ట‌ర్ తేజ న‌టీన‌టుల విష‌యంలో ఎన్ని  జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు టాక్. ఇక అస‌లు విష‌యానికొస్తే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఎన్టీఆర్ గా బాల‌కృష్ణ‌ యాక్ట్ చేస్తుండగా, మ‌రి ఆయ‌న అల్లుడి పాత్ర‌లో టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టుడ్ని ఎంపిక చేసిన‌ట్లు టాక్ 
యాంగ్రీ యంగ్ మాన్ రాజ‌శేఖ‌ర్  ఎన్టీఆర్ బ‌యోపిక్ లో చంద్ర‌బాబు పాత్ర‌పోషించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో గ‌రుడ‌వేగ షూటింగ్ స‌మయంలో రాజ‌శేఖ‌ర్..బాల‌కృష్ణ సినిమాలో చిన్న‌పాత్రైనా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. అందుకు బాల‌య్యా చిన్నా చిత‌కా క్యార‌క్ట‌ర్లు ఎందుకు...? ఇద్ద‌రం క‌లిసి ఓ సినిమా చేద్దాం అని హామీ ఇచ్చార‌ట‌. ఆ హామీకి అనుగుణంగా బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ లో చంద్ర‌బాబు పాత్ర క్యార‌క్ట‌ర్ ను రాజ‌శేఖ‌ర్ కు ఇచ్చిన‌ట్లు  టాక్ న‌డుస్తోంది. 
 ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారు? అయితే ఆయన ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు? అనేది తెలియాల్సి ఉంది.  ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ పై మాట్లాడిన తేజ ఈ సినిమా కథ చదువుతుంటే ఒక సినిమా సరిపోదు, ఆరు సినిమాలు తీయాలి. అంత పెద్దగా ఉంది కథ. ఆరు సినిమాల కథ ఒక సినిమాలోకి తేవడానికి మాకు టైమ్ పడుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరాకు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం అని తేజ తెలిపారు. 

English Title
Rajasekhar to Play the role of Chandrababu Naidu in NTR Biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES