చిన్నారి ప్రాణాలు కాపాడిన శునకం:వీడియో వైరల్

చిన్నారి ప్రాణాలు కాపాడిన శునకం:వీడియో వైరల్
x
Highlights

వడివడిగా అడుగులు వేసుకుంటూ నదిలోకి వెళ్తున్న ఓ చిన్నారి ప్రాణాలను శునకం కాపాడింది. నదిలో పడకుండా ఓ బాలికను సమయస్ఫూర్తితో కాపాడిన శునకం ఇప్పుడు అందరి...

వడివడిగా అడుగులు వేసుకుంటూ నదిలోకి వెళ్తున్న ఓ చిన్నారి ప్రాణాలను శునకం కాపాడింది. నదిలో పడకుండా ఓ బాలికను సమయస్ఫూర్తితో కాపాడిన శునకం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. నది సమీపంలో ఓ చిన్నారి ఆడుకుంటోంది. పాప ఆడే బంతి దగ్గరలోని నదిలో పడిపోయింది. బంతిని తిరిగి తెచ్చుకునేందుకు చిన్నారి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటు వెళ్లింది. బాల్ తీసుకునేందుకు ముందుకు వంగింది. కొంచెం ఉంటే ఆ చిన్నారి నీళ్లల్లో పడిపోయేదే. బంతి కోసం నీటిలోకి దిగుతున్న చిట్టిపాపను అక్కడే ఉన్న పెంపుడు కుక్క గమనించింది. వెంటనే చిన్నారి గౌను నోటితో పట్టుకుని వెనక్కి లాక్కొచ్చింది. అనంతరం నదిలోకి దిగి బంతిని బయటకు తెచ్చింది. ఒక వేళ కుక్క గమనించి ఉండకపోయి ఉంటే చిన్నారి నీళ్లలో మునిగిపోయేది. చిన్నారి ప్రాణాలను శునకం కాపాడడంతో.. ఆ కుక్కను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫిజిక్స్‌-ఆస్ట్రానమీ.ఆర్గ్‌ పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 3.39 మిలియన్ల మంది వీక్షించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories