మనప్రగడ శేషసాయి ఇక లేరు

మనప్రగడ శేషసాయి ఇక లేరు
x
Highlights

ప్రముఖ సంస్కృత పండితుడు,విజయనగరంలోని చారిత్రాత్మక మహారాజా కళాశాల మాజీ ప్రిన్సిపల్ మనప్రగడ శేషసాయి మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు....

ప్రముఖ సంస్కృత పండితుడు,

విజయనగరంలోని చారిత్రాత్మక మహారాజా కళాశాల

మాజీ ప్రిన్సిపల్ మనప్రగడ శేషసాయి మంగళవారం

తెల్లవారుజామున కన్నుమూశారు. రచయితగా,

పండితునిగా అయన సాహిత్య ప్రపంచంలో

చిరపరిచితులు. చాలా కాలం క్రితం తిరుపతిలో

శేషసాయి సంస్కృతం లో చేసిన ప్రసంగానికి

పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ముగ్దులయి

అనేక ప్రశంసలు కురిపించారు. 1927 సంవత్సరంలో

పశ్చిమ గోదావరి జిల్లా గణపర్రు గ్రామంలో శేషసాయి

జన్మించారు. సంస్కృత భాషలో అద్భుత నైపుణ్యం ఉన్న

ఆయన మన సంస్కృతి, కళలకు సంబంధించిన పలు

పుస్తకాలు రచించారు. తన సంస్కృత భాషా

పరిజ్ఞానంతో దశాబ్దాలుగా సాహిత్య ప్రపంచంలో

వెలుగులీనారు.

Show Full Article
Print Article
Next Story
More Stories