ఇద్దరిదీ మోసమే..

Submitted by arun on Tue, 08/14/2018 - 10:38
Rahul

తెలంగాణ టూర్ లో రాహుల్ అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని కడిగేశారు. అటు మోడీ, కేసిఆర్  వ్యవహార శైలిపై చురకలేశారు. మహిళలు లేనిదే పురోగతి సాధ్యం కాదన్న రాహుల్ డబల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేశాడన్నారు. 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ హాట్ హాట్ గా సాగుతోంది. ప్రత్యర్ధులపై పంచ్ లేస్తూ.. ఓటు బ్యాంకును ప్రశంసిస్తూ రాహుల్ ప్రసంగం సాగిపోయింది. కర్ణాటక నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ రోడ్డు మార్గం ద్వారా క్లాసిక్ గార్డెన్స్ లోని కన్వెన్షన్ హాలుకు చేరుకున్నారు. అక్కడ డ్వాక్రా మహిళలనుద్దేశించి ప్రసంగించారు. మోడీ సర్కార్ లో పేదవాడికి రుణం పుట్టదని రాహుల్ విమర్శించారు. 

అనంతరం శేరిలింగంపల్లిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో మోడీ, కేసీఆర్ లది ఒకటే స్టైలన్నారు. ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో 15 లక్షలు వేస్తామని మోడీ చెబితే ప్రతి పేదవాడికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తామని కేసీఆర్‌ చెప్పారన్నారు. ఇవి రెండూ నెరవేరేవి కావని రాహుల్ విమర్శించారు. ఇక రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యం ఉందని రాహుల్ మండి పడ్డారు. ఇక ఇవాళ రాహుల్, బూత్ కమిటీ ప్రెసిడెంట్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం పదిన్నరకు ప్రెస్ మీట్, 12 గంటలకు యువ సీఈవోలతో భేటీకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్‌పార్క్‌ వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మొత్తానికి కాంగ్రెస్ అధినేత రెండు రోజుల తెలంగాణ పర్యటనతో రాష్ట్రంలోని హస్తం నేతల్లో నూతన ఉత్తేజం వచ్చింది.

English Title
Rahul Gandhi Slams PM Modi & CM KCR at Congress Praja Chaitanya Yatra

MORE FROM AUTHOR

RELATED ARTICLES