రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకల్లో సూపర్ సీన్...రాహుల్‌కు ఇప్పటివరకు ఎవ్వరూ ఇవ్వని గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Submitted by arun on Thu, 06/21/2018 - 10:36

కొందరు శాలువాలు కప్పారు.. ఇంకొందరు.. పూలదండలు వేశారు.. మరికొందరు ఫ్లవర్ బొకేలు ఇచ్చారు.. కానీ బర్త్‌డే రోజు రాహుల్ గాంధీకి.. రేవంత్ రెడ్డి ఇచ్చిన గిఫ్టే నచ్చింది. అందుకే.. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో సూపర్ సీన్ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా.. అధినేతకు విషెస్ చెప్పేందుకు హస్తినకు వెళ్లారు. అంతా.. శాలువాలు కప్పి.. పూలబొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలోనే.. రాహుల్‌కు విషెస్ చెప్పేందుకు రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఏ నాయకుడూ చేయని సాహసం ఆయన చేశారు. ఇప్పటివరకు రాహుల్‌గాంధీకి ఎవరూ ఇవ్వని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చి.. రాగాతో పాటు అక్కడున్న పార్టీ సీనియర్లందరినీ రేవంత్ఆశ్చర్యపరిచారు .

రాహుల్ బర్త్‌డేను పురస్కరించుకొని.. ఆయనకు మహాశివుడి ఫోటోఫ్రేమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు రేవంత్ రెడ్డి. గిఫ్ట్‌ ఇచ్చిన రేవంత్‌ను రాహుల్‌ మెచ్చుకోవడంతో పాటు ఫోటో కూడా దిగారు. రాహుల్ హిందూ దేవుళ్లను నమ్ముతారో లేదోననే డౌట్‌తో.. పార్టీలో సీనియర్లెవ్వరూ ఇప్పటివరకు ఆయనకు దేవుడి ఫోటోలు కానుకగా ఇవ్వలేదు. ఆ మధ్య జరిగిన యూపీ.. ఈ మధ్యే ముగిసిన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో.. రాహుల్ హిందూ దేవాలయాలను విరివిగా సందర్శించారు. తాను శివభక్తుడినంటూ చాలాచోట్ల చెప్పారు. ఆ పాయింట్ గట్టిగా పట్టుకున్న రేవంత్ ఇలా బర్త్‌డే గిఫ్ట్‌గా మహాశివుడి ఫోటో ఫ్రేమ్ ఇచ్చి రాహుల్‌‌ను ఆనందపరిచారు.  

English Title
Rahul Gandhi Shocked To Revanth Reddy Special Birthday Gift

MORE FROM AUTHOR

RELATED ARTICLES