విమానంలో పురిటి నొప్పులు.. అత్యవసర ల్యాండింగ్‌ చేసి..

విమానంలో పురిటి నొప్పులు.. అత్యవసర ల్యాండింగ్‌ చేసి..
x
Highlights

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఫిలిప్పైన్స్‌కు చెందిన గర్భిణి పురుడు పోసుకుంది. రియాద్‌ నుంచి మనీలాకు వెళుతుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో సమీపంలో...

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఫిలిప్పైన్స్‌కు చెందిన గర్భిణి పురుడు పోసుకుంది. రియాద్‌ నుంచి మనీలాకు వెళుతుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో సమీపంలో ఉన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఏటీసీని సంప్రదించి విమానాన్ని శంషాబాద్‌లో విమానం దించారు. హుటాహుటిన చేరుకున్న అపోలో క్రెడిల్‌ వైద్య బృందం విమానాశ్రయంలోనే ఆమెకు పురుడు పోశారు. మొత్తానికి ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే భద్రతా కారణాలతో విమానంలోకి సర్జికల్‌ బ్లేడ్లకు అనుమతి లేకపోవడంతో బొడ్డు తాడును వేరుచేయలేకపోయారు. పరిస్థితి సంక్లిష్టంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను జూబ్లీహిల్స్‌లోని అపోలో క్రెడిల్‌ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కుదట పరిచిన తర్వాత చికిత్స నిర్వహించి బొడ్డు తాడును విడదీశారు. కాగా ఈ ఘటన ఈ నెల 8న చోటుచేసుకుంది. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories