రాహుల్ గాంధీ ‘పకోడా’ బ్రేక్...!

రాహుల్ గాంధీ ‘పకోడా’ బ్రేక్...!
x
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్ని టీ స్టాల్ లో కూర్చొని పకోడీ తిన్నారు. టీ తాగారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్ని టీ స్టాల్ లో కూర్చొని పకోడీ తిన్నారు. టీ తాగారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఊహించని విధంగా ఇలా చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉన్నారు.

పకోడీలు అమ్మడం కూడా ఉద్యోగమేనంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఆగి మరీ మిర్చి పకోడాలు తినడంపై ఆసక్తికర చర్చ సాగింది. కాగా ఇవాళ ఉదయం రాహుల్ సీఎం సిద్ధరామయ్యను వెంటబెట్టుకుని రాయ్‌చూర్‌లోని దర్గాను దర్శించారు. అనంతరం నగరంలో రోడ్‌షో నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories