చౌకీదార్ చోర్ వివాదం: రాహుల్‌కి సుప్రీం షాక్

చౌకీదార్ చోర్ వివాదం: రాహుల్‌కి సుప్రీం షాక్
x
Highlights

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చౌకీదారు చోర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ వివరణల్లో...

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చౌకీదారు చోర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ వివరణల్లో పశ్చాత్తాపం కన్పించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాహుల్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది . తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

ఇటీవల తన సొంత నియోజకవర్గం అమేథీలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టే చెప్పింది అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పరువునష్టం దావా వేశారు. రాఫెల్ వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వక్రీకరించారంటూ ఆమె కోర్టుకు వెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. అత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని, కొందరు వక్రీకరించారని, అయినా సారీ చెబుతున్నానని తెలిపారు. అయితే, రాహుల్ గాంధీ వివరణకు సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. రాహుల్ చెప్పిన క్షమాపణలో పశ్చాత్తాపం కనపడలేదని అభిప్రాయపడింది. అసలు చౌకీదార్ అంటే ఎవరు?ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని ఆదేశిస్తూ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

చౌకీదార్‌ చోర్‌ అనే పద ప్రయోగంపై రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎక్కడా ఆయన క్షమాపణలు కోరలేదని, కేవలం చౌకీదార్‌ చోర్‌ అనే వ్యాఖ్యలను సుప్రీం తీర్పునకు ఆపాదించానని మాత్రమే ఒప్పుకున్నారని మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు. రాహుల్‌ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్న పదాన్ని బ్రాకెట్‌లో పెట్టారని వివరించారు. ఈ నెల 30వ తేదీ లోపుగా చౌకీదార్ చోర్‌ హౌ విషయమై సమాధానం ఇవ్వాల రాహుల్ గాంధీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories