బిగ్‌బాస్ వాయిస్ ఎవ‌రిదో తెలుసా?

Submitted by arun on Sat, 06/16/2018 - 15:23
bigboss

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజ‌న్ 1, నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 ల‌లో ఎవ‌రికి క‌నిపించ‌కుండా ఓ వ్య‌క్తి హౌజ్‌లోని అంద‌రు కంటెస్టెంట్స్‌ని కంట్రోల్‌ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గాంభీర్య‌మైన గొంతుతో భ‌య‌పెట్టించే ఆ వ్య‌క్తి అప్పుడ‌ప్పుడు టాస్క్‌లు ఇస్తూ, రూల్ అదిగ‌మిస్తే వారిని హెచ్చ‌రిస్తూ ఉంటారు. అజ్ఞాత‌వాసిలా ఉండే బిగ్ బాస్ ఎవ‌ర‌నే విష‌యాన్ని సీజ‌న్ 1 పూర్తైన త‌ర్వాత రివీల్ చేస్తార‌ని అప్ప‌ట్లో అంద‌రు భావించారు. కాని అలాంటిదేమి లేకుండా షో ముగించేశారు. ఇప్పుడు సీజ‌న్ 2 మొద‌లైంది. ఇందులోను బిగ్ బాస్‌ది అదే గొంతు. మ‌రి గంభీర‌మైన గొంతుతో ఉన్న ఆ గంభీర‌మైన మ‌నిషి ఎవ‌ర‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. అయితే వీటన్నింటికి సమాధానంగా ఓ వార్త  హల్‌చల్‌ చేస్తోంది.

బిగ్‌బాస్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నది ఓ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అని ఓ గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. పలు సినిమాలు, సీరియల్లు, ప్రకటనలకు డబ్బింగ్‌ చెప్పిన సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రాధాకృష్ణ బిగ్‌బాస్‌గా గొంతు సవరించారంట. ఇందుకోసం నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించి, రాధాకృష్ణను ఎంచుకున్నారట. అయితే ఈ వార్త ఎంత వరకూ అనేది రాధాకృష్ణ స్పందిస్తే తప్ప ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్‌ ఏంచేస్తారంటే.. కంటెస్టంట్లకు టాస్క్‌ ఇవ్వడం, ఆదేశాలను జారీచేయడం, బిగ్‌బాస్‌ నియమనిబంధలను తెలియచెప్పడం వంటి పనులు చేస్తారు.

English Title
radha krishna voice of telugu big boss

MORE FROM AUTHOR

RELATED ARTICLES