'రాజా ది గ్రేట్' విడుద‌ల వాయిదా?

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 17:34

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ గ‌త చిత్రం 'బెంగాల్ టైగ‌ర్' రిలీజై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ఆ సినిమా త‌రువాత కొద్ది కాలం విరామం తీసుకున్న ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం  'రాజా ది గ్రేట్‌', 'ట‌చ్ చేసి చూడు' చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వీటిలో 'రాజా ది గ్రేట్' విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

అయితే అక్టోబ‌ర్ 13న నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న 'రాజు గారి గ‌ది2'ని విడుద‌ల చేస్తుండ‌డంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. అక్టోబ‌ర్ 18న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. 'రాజా ది గ్రేట్‌'లో ర‌వితేజ అంధుడి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. అత‌ని స‌ర‌స‌న మెహ‌రీన్ క‌థానాయికగా న‌టిస్తోంది. సాయికార్తీక్ సంగీత‌మందిస్తున్నాడు.

English Title
is 'raaja the great' release postpone?

MORE FROM AUTHOR

RELATED ARTICLES