పీవీ సింధు పేరును పద్మభూషణ్‌‌కు ప్రతిపాదించిన క్రీడా శాఖ

పీవీ సింధు పేరును పద్మభూషణ్‌‌కు ప్రతిపాదించిన క్రీడా శాఖ
x
Highlights

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సత్తా చాటి రజత పతాక విజేతగా నిలిచిన పీవీ సింధు పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించినట్లు కేంద్ర క్రీడా...

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సత్తా చాటి రజత పతాక విజేతగా నిలిచిన పీవీ సింధు పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించినట్లు కేంద్ర క్రీడా శాఖ తెలిపింది. ఈ సంవత్సరం ధోనీ తర్వాత పద్మభూషణ్‌ అవార్డులకు ప్రతిపాదించిన క్రీడాకారిణి పీవీ సింధునే కావడం విశేషం. పద్మభూషణ్ పురస్కారం అనేది దేశంలోనే అత్యున్నత్త పురస్కారాల్లో మూడవది. అలాంటి అవార్డుకు సింధు పేరును క్రీడా శాఖ ప్రతిపాదించడంపై ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కొరియా ఓపెన్ సిరీస్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాను ఓడించి సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 22 ఏళ్ల ఈ హైదరాబాదీ షట్లర్‌కు 2013లో అర్జున అవార్డును ప్రదానం చేశారు. 2016లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డును అందుకుంది. 2015లో పద్మశ్రీతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. క్రీడల్లో రాణించిన వారికి ఈ అవార్డును ఇస్తారు. ఇదిలా ఉంటే పీవీ సింధుతో పాటు మరో ఒలింపిక్ విజేత పేరును ప్రతిపాదించాలని క్రీడా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. 1952లో హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ జాదవ్ కాంస్య పతకాన్ని గెలుపొందాడు. ఆ క్రీడాకారుడిని ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. జాదవ్ 1984లో మృతి చెందాడు. జాదవ్ పేరును కూడా 2018 పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించాలని క్రీడా శాఖ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories