కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ.. ఆయన ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో బీజీ..

కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ.. ఆయన ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో బీజీ..
x
Highlights

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఏడు విడతల్లో 542 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎగ్జిట్ ‌పోల్స్ ఎన్డీఏకు పట్టం కట్టాయి....

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఏడు విడతల్లో 542 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎగ్జిట్ ‌పోల్స్ ఎన్డీఏకు పట్టం కట్టాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పకముందే కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే సంగతి తమకు తెలుసన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. నిన్న వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సంబరాలకు సన్నద్ధమవుతోంది. తాము ఉహించినట్లుగానే కేంద్రంలో తిరిగి ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టనుందని అందుకు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలే నిదర్శనమని పార్టీ ముఖ్య నేతలు అన్నారు. ఇక తెలంగాణలో కూడా ఓట్ షేర్ పెంచుకుని సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. మొదటి నుండి స్పష్టంగా చెబుతున్నాం నరేంద్రమోడీ పనితీరుకు ప్రజలు పట్టం కట్టారు. గత ఐదేండ్లలో నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన, రాజీ లేనటువంటి పోరాటం అవినీతి మీద చేయడం, అభివృద్ది ఎజెండాగా పనిచేయడం, ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాలే తమ విజయానికి కారణం కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటమికి సాకులు వెతుక్కునే పనిలోనే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని లక్ష్మణ్‌ సెటైర్లు వేశారు. కేవలం ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈసీ, ఈవీఎం మీద పడి నిందలు వెస్తున్నరని చంద్రబాబును ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గెలిచినప్సుడు ఈవీఎంలు బేష్.. మరీ ఇప్పుడు ఓడిపోతున్నారు కాబట్టి ఇలాంటి నిందలు వేస్తున్నారని ఓటమి భయంలో చంద్రబాబు ఎం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడంలేదని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories