దుర్గగుడిలో ప్రొటోకాల్‌ వివాదం...ఎమ్మెల్యే బోండా ఉమాకు తీవ్ర అవమానం

దుర్గగుడిలో ప్రొటోకాల్‌ వివాదం...ఎమ్మెల్యే బోండా ఉమాకు తీవ్ర అవమానం
x
Highlights

విజయవాడ దుర్గగుడిలో మరోసారి ప్రోటోకాల్‌ వివాదం రేగింది. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో ఎమ్మెల్యే...

విజయవాడ దుర్గగుడిలో మరోసారి ప్రోటోకాల్‌ వివాదం రేగింది. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో ఎమ్మెల్యే బోండా ఉమాకు తీవ్ర అవమానం జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్‌ ఉన్న ఆయన రాకముందే అసిస్టెంట్‌ ఈవో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. అధికారలు తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.

అయితే ఈ వివాదంలో తమ తప్పేమిలేదంటున్నారు ఈవో కోటేశ్వరమ్మ. టీటీడీ ఆదేశాల మేరకే అసిస్టెంట్ ఈవోతో పట్టువస్త్రాలు సమర్పించారంటూ వివరించారు. ఎమ్మెల్యే వస్తున్నట్టు తమకు కనీస సమాచారం కూడా లేదని ఆమె సమర్ధించుకున్నారు. అమ్మవారి సారె తీసుకొచ్చిన వారిని గౌరవ ప్రదంగా లోపలికి అనుమతించామని ఇందులో తమ ప్రమేయమేమి లేదన్నారు. ఈ విషయంలో తాను కూడా ఉన్నతాధికారుల సూచన మేరకే నడుచుకున్నానని పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ అస్టిస్టెంట్‌ ఈవో సాయి చెబుతున్నారు. టీటీడీ అధికారుల తీరు, దుర్గగుడి వ్యవహారశైలితో తీవ్ర ఆవేదనకు గురైన ఎమ్మెల్యే బోండా ఉమా అమ్మవారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories