1996 సీన్ ని కేసీఆర్ రిపీట్ చేస్తారా?

1996 సీన్ ని కేసీఆర్ రిపీట్ చేస్తారా?
x
Highlights

ఎ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ రాదు. ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే అని పెట్టిన ప్రతి సభలో కేసీఆర్ చెప్పుకొస్తున్న మాట ఇదే .. బిజెపి మరియు...

ఎ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ రాదు. ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే అని పెట్టిన ప్రతి సభలో కేసీఆర్ చెప్పుకొస్తున్న మాట ఇదే .. బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలన్ని జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే .. ఒక వైపు ఐదో దశకు సార్వత్రిక ఎన్నికలు కూడా చేరుకోవడంతో ఫెడరల్ ఫ్రంట్ పై స్పీడ్ పెంచారు కేసీఆర్ . అందులో భాగంగానే ఎక్కడెక్కడ ఐతే ఎన్నికలు ముగిసాయో అక్కడి ప్రాంతీయ పార్టీల నేతలతో భేటికి సిద్దమయ్యారు కేసీఆర్ ..

నిన్న కేరళకి వెళ్లి అక్కడి సీఎం కమ్యూనిస్టు నేత పినరయి విజయన్ తో కేసీఆర్ కీలక చర్చలు జరిపారు.. చర్చలో భాగంగా 1996 ఫార్ములా గురించే కేసీఆర్ చర్చించినట్టు సమాచారం..1996 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారత జాతీయ కాంగ్రేస్ ఓడిపోయి, అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామా చేసిన తర్వాత, జాతీయవాద పార్టీలు ప్రభుత్వము నెలకొల్పడంలో విఫలమయ్యాయి. అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ (కాంగ్రెస్ యేతర, బి.జె.పి.యేతర ప్రాంతీయ పార్టీలతో కలసి) కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడు దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి నాయకునిగా ఎన్నుకోబడి దేశానికి 11వ ప్రధానమంత్రి అయ్యాడు...

ఇప్పుడు ఇదే ఫార్ములాని రిపీట్ చేయాలనీ కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం .. జరుగుతున్న ఎనికల్లో హంగ్ ఏర్పడితే దక్షణాది రాష్ట్రాలలోని ఎవరినైనా ప్రధానమంత్రిని చేయాలనదే కేసీఆర్ అసలు ప్లాన్ అని తెలుస్తుంది .. ఇదే విషయాన్ని ఇప్పటికే కేరళ సిఎంతో మరియు కర్ణాటక సిఎంతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది .. ఒకవేళ అయన అనుకునట్టు ఎవరికీ సంపూర్ణ మెజారిటి రాకుంటే దక్షిణాది నేతలు కలిసికట్టుగా ఉండి ఇక్కడి నేతనే ప్రధానిగా చూడొచ్చని కేసీఆర్ అసలు సిసలు ప్లాన్ అనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్..

Show Full Article
Print Article
Next Story
More Stories