అవార్డు ప్ర‌క‌ట‌న‌పై వివాదం..

అవార్డు ప్ర‌క‌ట‌న‌పై వివాదం..
x
Highlights

65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను అధికారికంగా ప్రకటించారు. జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న దర్శకుడు శేఖర్ కపూర్ ఈ అవార్డులను ఢిల్లీలోని శాస్త్రి భవన్...

65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను అధికారికంగా ప్రకటించారు. జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న దర్శకుడు శేఖర్ కపూర్ ఈ అవార్డులను ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలకు కూడా స్థానం లభించింది. రానా నటించిన 'ఘాజీ' చిత్రానికి బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు దక్కింది. ఇదే సమయంలో 'బాహుబలి-2'కి మూడు అవార్డులు లభించాయి.

ఇంతవరకు బాగానే ఉంది కానీ... ఇక్కడే జ్యూరీ అతిపెద్ద పొరపాటు చేసింది. బాహుబలి ది కంక్లూజన్ యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీ మొఘల్‌ను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా జ్యూరీ ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ ‘బాహుబలి’ యాక్షన్ డైరెక్టర్ విషయంలో పెద్ద తప్పే జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? ఆయన అసలు బాహుబలి-1 లేదంటే 2కి పని చేయలేదు’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అసలు ‘బాహుబలి’కి యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్ పని చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories