విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో తిష్ట వేసిన సమస్యలు

x
Highlights

ఉత్తరాంధ్రుల ఆరోగ్య ప్రదాయనిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. నిధుల కొరతతో శస్త్రచికిత్సలకు అవరోధంగా మారింది. ఆస్పత్రి...

ఉత్తరాంధ్రుల ఆరోగ్య ప్రదాయనిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. నిధుల కొరతతో శస్త్రచికిత్సలకు అవరోధంగా మారింది. ఆస్పత్రి అభివృద్ధి నిధులతో ఇంతకాలం నెట్టుకొచ్చినా ప్రభుత్వం సత్వరం స్పందించకపోతే రోగుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి ఉత్తరాంధ్రుల‌తో పాటు పోరుగు రాష్ట్రాలు అయిన ఒడిశా, చత్తీస్‌ఘడ్ లకు వైద్య సేవలు అందిస్తుంది. నిత్యం ఇన్, అవుట్ పేషెంట్లతో బిజీగా ఉండే కేసీహెచ్‌లో రోజుకి దాదాపు 100నుండి 150 వరకు శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి కార్పోరేట్ ఆస్పత్రికి వెళ్లే స్తోమత లేనివారు దిగువ, మధ్య తరగతి వారికి కేసీహెచ్ ఆరోగ్య ప్రదాయని. అయితే కొంత కాలంగా శస్త్రచికిత్సలకు అవసరమైన సామాగ్రి తో పాటు సర్జికల్ నిధులు కూడా కేజీహెచ్‌కు అందడం లేదు. దీంతో ఇప్పటివరకు కేజీహెచ్ అభివ్రుద్ది నిధులను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే వాటిని పరిమితి కూడా దాటడంతో మరో పదిరోజుల్లో కేజీహెచ్ లో శస్త్రచికిత్సలకు అవరోధం ఏర్పడే ప్రమాదం వుంది.

అయితే వైద్యులు మాత్రం ప్రస్తుతానికి ఇబ్బంది లేదని త్వరలో ప్రభుత్వం నిధులు సమకూరిస్తే సరిపోతుందని అంటున్నారు. బడ్జెట్ లో నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వాలు గత రెండు విడతలుగా కేజీహెచ్‌కు ఒక్క రూపాయికూడా ఇవ్వలేదు దీంతో సర్జకల్ ఐటమ్స్ అయిన సూదులు, దారాలు, సిరంజలు మొదలైనవి కొనుక్కోలేక ఆ భారాన్ని రోగుల మీద వేసే పరిస్థితి దాపురించింది. దీనిపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉత్సవాలు, సమావేశాలు పేరిట వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు పేదలకు అత్యంత అవసరమైన ఆసుపత్రి సేవల విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తక్షణం కేజీహెచ్ కు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం వెంటనే స్పందించి కేజీహెచ్ ను ఆదుకోవాలని తక్షణమే పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories