చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర .. 250 కి కిలో చికెన్

చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర .. 250 కి కిలో చికెన్
x
Highlights

ఒకప్పుడు సండే వస్తే చాలు ఇంట్లో నాన్ వెజ్ తప్పకుండా ఉండాల్సిందే .. కానీ పరిస్థతి ఇప్పుడు అలా లేదు .. తినాలి అని ఉందా వారంతో పని లేదు .. ఎప్పుడు పడితే...

ఒకప్పుడు సండే వస్తే చాలు ఇంట్లో నాన్ వెజ్ తప్పకుండా ఉండాల్సిందే .. కానీ పరిస్థతి ఇప్పుడు అలా లేదు .. తినాలి అని ఉందా వారంతో పని లేదు .. ఎప్పుడు పడితే అప్పుడు తినేయడమే.. కానీ ఇప్పుడు చికెన్ తినాలి అంటే వెనక ముందు ఆలోచించాల్సిన అవరసం ఏర్పడుతుంది .. ఎందుకంటే బయట ఎండల లాగే చికెన్ షాప్స్ లో కూడా చికెన్ ధర పెరిగింది ..

ఓ రెండు నెలల కింద కిలో మటన్ కి పెట్టె ధర పెడితే కొంచం అటుఇటుగా చికెన్ రెండున్నర కిలోలు ఈజీగా వచ్చేది . కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది .. ఇప్పుడు కిలో చికెన్ కి పెట్టె ధరకి ఇంకో వంద రూపాయలు కలిపితే ఎంచక్కా మటన్ వచ్చేస్తుంది .. దీనిని బట్టి మనమే అర్ధం చేసుకోవచ్చు చికెన్ ధర మార్కెట్లో ఎలా ఉందొ ..

భానుడి ప్రాభవం వల్ల కోళ్ళు చనిపోతుండడంతో మార్కెట్ లోకి కోళ్ళు సప్లయ్ తగ్గిపోతుంది . అందువల్ల సమ్మర్ లో చికెన్ రేట్ అమాంతం పెరిగిపోయింది . మొన్నటివరకు 210 రూపాయలు ఉన్న చికెన్ ధర ఇప్పుడు 250 కి పైనే ధర పలుకుతుంది . దీనితో సేల్స్ కూడా పడిపోయాయి అని అంటున్నారు షాప్ యజమానులు .. రేట్ తగ్గితే ఇటు మాసం ప్రియులకు మరియు షాప్ యజమానులకు కొంతలో కొంత బాగుంటదని పలువురు అభిప్రాయపడుతున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories