సల్మాన్ ఖాన్ చెల్లికి వెయ్యి సార్లు ఫోన్ చేసిన ప్రియాంక...

Submitted by arun on Sat, 09/08/2018 - 15:58
sp

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారత్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపిక చేశారు.. కానీ ఆమె కొద్దీ రోజుల క్రితం ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. దీనికి కారణం ప్రియాంకకు తన ప్రియుడు నిక్ జోనాస్ తో పెళ్లి నిశ్చయం అవడం.  నిశ్చితార్ధం, పెళ్లి వెంటవెంటనే ఉండటంలో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు సల్మాన్ కు చెప్పారట. ఈ ప్రాజెక్టు లో  ప్రియాంక స్థానంలో  కత్రినా కైఫ్ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ప్రియాంకను కథానాయికగా తీసుకోమని డైరెక్టర్ అబ్బాస్ కు చెప్పారట సల్మాన్, సల్మాన్ చెప్పడంతో ఒకే చెప్పేశాడట డైరెక్టర్. కానీ తన నిశ్చితార్థం వెంటనే నాలుగు రోజులలో పెళ్లి ఆ తర్వాత హనీమూన్ ఉండటంతో తనకు షెడ్యూల్ కుదరదని చెప్పేసిందట ప్రియాంక. 75 నుండి 80 రోజులు షూటింగ్ కి రావడం కష్టమని సినిమానుండి తప్పుకుంటున్నట్లు చెప్పారట. ఈ ప్రాజెక్టుకు సల్మాన్ ఖాన్ ప్రియాంకను సెలెక్ట్ చెయ్యడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ప్రియాంక సల్మాన్ తో నటించడానికి సళ్ళు బాయ్ చెల్లెలుకు వెయ్యి సార్లు కాల్ చేశారట.. గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయంపై కొందరు సల్మాన్ ను ప్రశ్నించగా అయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం ప్రియాంకకు ఇష్టంలేదు. ఎదుకంటే ఆమె ఈ సినిమాలో నటించడం కోసం చాలా ఆసక్తి చూపించారు. డైరెక్టర్ కు కూడా కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కు తనను తీసుకోవాలి అని కోరారు. నాతొ నటించడానికి నా చెల్లి అర్పితా  ఖాన్ కు వెయ్యి సార్లకు పైగా ఫోన్ చేసి సల్మాన్ తో కలిసి పనిచేయాలని ఉంది ఎలాగైనా నువ్వే  ఒప్పించాలి అని తన చెల్లిని కోరినట్లుగా సల్మాన్ ఖాన్ తెలిపారు.

English Title
Priyanka Chopra 'Called Up Arpita Thousand Times' Asking For Bharat: Salman Khan

MORE FROM AUTHOR

RELATED ARTICLES