పీకల్లోతు ప్రేమలో మునిగిన హాట్ కపుల్

Submitted by arun on Wed, 06/27/2018 - 17:08
priyanka chopra, nick jonas

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు  ఎక్స్ పోర్ట్ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తన ప్రియుడు నిక్ జోనాస్ తో సాగిస్తున్న ప్రేమాయణానికి ముగింపు పలకబోతోందా..? త్వరలోనే ఓ ఇంటి పక్షులవుతారా..? పీకల్లోతు ప్రేమలో ఉన్న వారిద్దరూ ఒక్కటయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? ప్రస్తతం గోవా వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట వచ్చే నెలలోనే నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

క్వాంటికో, బేవాచ్ సిరీస్‌లతో హాలీవుడ్ లో సత్తా చాటి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్‌లో ఉందన్న ఊహాగానాలు మొన్న ముంబైలో ఈ జంటను చూసిన తర్వాత నిజమయ్యాయి. తొలుత అమెరికా లాస్ ఏంజెలెస్ లో బ్యూటీ అండ్ ది బీస్ట్ లైవ్ కాన్సర్ట్ తో వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని కనిపించడంతో ప్రియాంక లవ్ మ్యాటర్  బయటపడింది. 

అప్పటి నుంచి వీరిద్దరూ చాలా ప్రాంతాల్లో కెమెరాలకు చిక్కారు. అమెరికా వీధుల్లో వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. జూన్ 21 న ఈ ఇద్దరూ కలిసి ముంబైకి రావడం సంచలనంగా మారింది. అంతకుముందే నిక్ తన కజిన్ మ్యారేజ్ సెర్మనీలో ప్రియురాలు ప్రియాంకను తల్లిదండ్రులకు పరిచయం చేశారు. ప్రస్తుతం  ప్రియాంక తన తల్లిదండ్రులకు జోనాస్‌ను పరిచయం చేయించేందుకే తీసుకొచ్చారని చెబుతున్నారు. 

 ప్రస్తుతం గోవా వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట బీచ్, రిసార్టులలో సాగిస్తున్న ప్రేమాయణం తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వచ్చే నెలలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుంటారని తెలుస్తోంది. జూలై చివరివారం లేదా ఆగస్ట్ తొలివారంలో వేడుక జరగనుందని దీనికి ఇరు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చాటు మాటు ప్రేమాయణంతో రహస్య స్నేహితుడితో సాగిస్తున్న ప్రేమాయణానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

English Title
Priyanka Chopra and Nick Jonas to get engaged in a month?

MORE FROM AUTHOR

RELATED ARTICLES