ట్విట‌ర్ ద్వారా ప్రియురాలిని ప‌రిచ‌యం చేసిన ప్రియ‌ద‌ర్శి!

Submitted by arun on Wed, 02/14/2018 - 17:35
priyadarshi

పెళ్లి చూపులు సినిమాలో తెలంగాణ యాసతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన పాపులర్ కమెడీయన్ ప్రియదర్శి. రీసెంట్ గా తొలి ప్రేమ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియదర్శి, ‘అ’ అనే సినిమాలోను ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ప్రతీ సినిమాలో కొత్త దనం కనబరుస్తూ ఆడియన్స్ చే అభినందనలు అందుకుంటున్న ప్రియదర్శి వేలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలికి ప్రేమ లేఖ రాసాడు. ప్రియదర్శి, రిచా ఇద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ `డియ‌ర్ ల‌వ్‌.. నీ ప‌ట్ల నా ప్రేమ‌ను, ఆలోచన‌ల‌ని పదాలుగా మార్చి రాయాలనుకోగా, అది జరగలేదు. నీ హృదయం గురించి రాయడానికి కచ్చితంగా లక్షల కొద్దీ పదాలు,పద్యాలు కావాలి. జీవిత కాలంలో ప్రతి రోజు, ప్రతీ క్షణం వాటి కోసమే ప్రయత్నిస్తున్నా. నిన్ను నా జీవితంలోకి తీసుకు వచ్చిన విధికి నా ధన్యవాదాలు చెప్పడం తప్ప మరేం చేయలేను. స్నేహాన్ని, ప్రేమని పండుగలా జరుపుకుందాం. ప్రేమకు నిర్వచనంలా నిలుద్దాం. పుట్టిన రోజు శుభాకాంక్షలు రిచా. మై డార్లింగ్ వేలంటైన్‌.. నిన్ను ప్రేమించ‌డం కంటే నాకు ఇంక ఏదీ ఎక్కువ కాదు` అని ప్రియ‌ద‌ర్శి తన ప్రేయసికి ప్రేమ‌లేఖ రాశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

English Title
priyadarshi Love letter Twitter

MORE FROM AUTHOR

RELATED ARTICLES