ప్రియా ప్రకాశ్.. అలా దూసుకుపోతోంది

Submitted by arun on Mon, 03/12/2018 - 14:58
Priya Varrier

అలా కన్ను కొట్టి.. ఇలా అందరినీ పడేసిన పదహారేళ్ల అమ్మాయి ప్రియా ప్రకాశ్ వారియర్.. అనూహ్యమైన ఆఫర్లను అందుకుంటోంది. మలయాళ ఇండస్ట్రీకే కాక.. యావత్ భారత దేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నిటికీ ఇప్పుడు ప్రియా హాట్ కేక్ లా మారింది. ఫ్రెష్ లుక్.. విపరీతమైన పాపులారిటీ ఉండడంతో.. ముంబై నుంచి హైదరాబాద్ వరకూ చాలా మంది హీరోలు ప్రియానే కావాలని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా.. బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో.. తెలుగు టెంపర్ సినిమా రీ మేక్ అవుతోంది. అందులో.. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. సింబా పేరుతో వస్తున్న ఈ సినిమాను.. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. ఇన్నాళ్లూ ఈ సినిమాలో.. శ్రీదేవి కూతరు జాన్వీ.. ఆలియా భట్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ.. ఇప్పుడు ప్రియా ప్రకాశ్ అయితే బెటర్ ఆప్షన్ అని భావిస్తున్నారు.

అనుకోవడమే కాకుండా.. ప్రియాను ఇప్పటికే యూనిట్ కూడా సంప్రదించిందనీ.. ఆమె కూడా రణ్ వీర్ లాంటి హీరో పక్కన చేస్తే మరింత పాపులారిటీ ఖాయమని భావిస్తోందని తెలుస్తోంది. త్వరలోనే.. ఈ విషయంపై క్లారిటీ రానుంది.

English Title
Priya Varrier to share screen space with Ranveer Singh in 'Simmba'?

MORE FROM AUTHOR

RELATED ARTICLES