సుప్రీంను ఆశ్రయించిన ప్రియా వారియర్

Submitted by arun on Tue, 02/20/2018 - 16:15
Priya Prakash Varrier

ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒరు ఆదార్ లవ్ మూవీలోని.. పాటపై వచ్చిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్‌ ఒమర్ లులూతో కలిసి సుప్రీంను ఆశ్రయించింది. హైదరాబాద్, మహారాష్ట్రలో నమోదైన కంప్లైంట్లపై.. స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది.

నేషనల్ క్రష్ ప్రియా వారియర్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో.. ఒరు ఆదార్ లవ్‌ మూవీలోని మాణిక్య మలరాయ పూవి సాంగ్‌పై వివాదం కూడా ఆ రేంజ్‌లోనే నడుస్తోంది. ముస్లింలను కించపరిచే విధంగా పాటను చిత్రీకరించారని హైదరాబాద్, మహారాష్ట్రలో కంప్లైంట్లు నమోదయ్యాయి. సినిమాలో నుంచి ఆ పాటను వెంటనే తొలగించాలని పాతబస్తీ యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు చిత్ర యూనిట్‌కు నోటీసులిచ్చారు. 15 రోజుల లోపు వివరణ ఇవ్వాలని కోరారు. 

మాణిక్య మలరాయ పూవి పాటలోని కొన్ని చరణాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని కొందరు ముస్లిం యువకులు కంప్లైంట్ చేశారు. ఈ పాటను ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తే మహమ్మద్ ప్రవక్త ఆయన ప్రేయసి ఖతీజాల ప్రేమను కించపరిచే విధంగా అర్థం వస్తోందని చెప్తున్నారు. వీటన్నింటిని పరిశీలించిన ఫలక్‌నుమా పోలీసులు ఫైనల్‌గా 295A IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి డైరెక్టర్ ఒమర్ లులూకి నోటీసులిచ్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్, మహారాష్ట్రలో కంప్లైంట్లు నమోదవడంపై ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒరు ఆదార్ లవ్ మూవీలోని పాటపై వచ్చిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్‌ ఒమర్ లులూతో కలిసి సుప్రీంను ఆశ్రయించి స్టే ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు.

English Title
Priya Prakash Varrier knocks on SC door to quash FIR against her

MORE FROM AUTHOR

RELATED ARTICLES