" మీ జ్ఞాపకశక్తిలో గజనిలా కాకుండా, రోబోలో రజనిలా అవ్వడమెలా"

 మీ జ్ఞాపకశక్తిలో గజనిలా కాకుండా, రోబోలో రజనిలా అవ్వడమెలా
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం " మీ జ్ఞాపకశక్తిలో గజనిలా కాకుండా, రోబోలో రజనిలా అవ్వడమెలా" భరత్ తన బ్యాంకు ఎకౌంటు నుండి కాష్...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం " మీ జ్ఞాపకశక్తిలో గజనిలా కాకుండా, రోబోలో రజనిలా అవ్వడమెలా"

భరత్ తన బ్యాంకు ఎకౌంటు నుండి కాష్ తీసుకుందామని, తమ ఇంటి పక్కనే వున్నా ఆంధ్ర బ్యాంకు ఏటీఎం సెంటర్కు వెళ్లిన తర్వాత, ఈమధ్యే తను మార్చుకున్న తన ఏటీఎం పిన్ నెంబర్ మర్చిపోయాడు, ఎంత సేపు ఆలోచించిన అప్పుడు గుర్తుకు రావట్లేదు, ఎ.సి గాలితో చల్లగా వున్నా ఏటీఎం సెంటర్లో కూడా తనకి చెమటలు పట్టసాగాయి.. అలాగే తార రోజు తన ఫేస్బుక్ మొబైల్లో చూస్తూ వుంటుంది, అయితే ఒక రోజు లాప్టాప్ లో పేస్ బుక్ ఓపెన్ చేద్దామనుకోంది...కానీ తన పాస్వర్డ్ ఎంతకి గుర్తుకురాలేదు. అలాగే రఘు ఎగ్జాం ప్రేపరషన్ చాల బాగా అయిన కూడా, ఎగ్జాం సెంటర్లో వెళ్ళగానే మాత్రం, ముఖ్యమైన సమాధానాలు గుర్తుకు రాక చాల ఇబ్బంది పడేవాడు.

ఫ్రండ్స్ ! ఇలా చాలామందికి గుర్తుకు పెట్టుకోవడం కష్టం అవుతుంది. తమ "బైక్ కీస్" ఎక్కడ పెట్టారో మరచిపోతారు లేదా ఒక పెద్ద షాపింగ్ మాల్లలో తమ కార్ ఎక్కడ పార్క్ చేశారో లాంటి చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటారు. కాని కొద్ది మంది మాత్రం మెమరీ అథ్లెట్లాగా, ఏదైనా అద్బుతంగా గుర్తుకి పెట్టుకొని ఎన్నో బహుమతులు గెలుస్తూ వుంటారు. అలాగే కొద్ది మంది అష్టవదానం, శతావధానం కూడా చేసి, ఎన్నో విషయాలు గుర్తుకి పెట్టుకుంటారు. అయితే కొద్దిమందికి ఈ జ్ఞాపక శక్తి పుట్టుకతోనే వస్తుంది అనే భ్రమలో వుంటారు. వాస్తవానికి మనకి వీక్ మెమరీ, స్ట్రాంగ్ మెమరీ అనేది వుండదట, ఒక్క శిక్షణ తీసుకొన్న మెమరీ లేదా శిక్షణ తీసుకొని మెమరీ మాత్రమే వుంటుంది అని పరిశోధకులు చెపుతున్నారు. కాబట్టి మన మెమొరీ విషయంలో మనం గజని సినిమాలో సూర్యలా కాకుండా, రోబో సినిమాలో రోబో రజని లా అన్ని గుర్తుకు పెట్టుకోవటానికి, ఐదు సులభమైన పద్దతులు ఏంటో ఇప్పుడు చూద్దాము.

అయితే మన జీవితంలో ప్రతి విషయం ఎప్పుడు గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు. అలాగే మన జీవితంలో కొన్ని అనవసర విషయాలు మర్చిపోవడం మంచిదే, కాని తన జీవితంలోని సంతోషమైన సంఘటనలు మరచిపోయి, తనకు నచ్చని, భాధాకరమైన సంఘటనలు మాత్రమే గుర్తుకు వుంచుకంటే మాత్రం, ఆ వ్యక్తి దురదృష్టవంతుడే కదా. కాబట్టి మనం కోరుకోనేవి గుర్తుకు పెట్టుకోడానికి ఈ ఐదు పద్దతుల్లలో ..

మొదటిది... తెలిసిన విషయానికి, కొత్త విషయాన్ని జోడించండి:

ఏదైనా ఒక కొత్త విషయం లేదా సమాచారం మన వర్కింగ్ మెమరీ లేదా షార్ట్ టర్మ్ మెమరీ నుండి మన మైండ్ లోని లాంగ్ టర్మ్ మెమరీ లోకి వెళ్ళటానికి ఒక మంచి దారి ఏంటంటే.... ఇప్పటికే మనకు తెలిసిన విషయానికి, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న కొత్త విషయాన్నీ జోడించడం. ఎప్పుడైతే ఒక కొత్తగా తెలుసుకున్న విషయాన్ని, మనకు తెలిసిన పాత విషయంలో పోల్చుకొని, అర్ధం చేసుకోవడం వలన సులభంగా ఆ విషయాన్నీ గుర్తుకు పెట్టుకోగలము.

రెండవది........మెమరీ పాలస్ ని నిర్మించుకోండి:

మనం కొన్ని కొత్త పదాలను, లేదా కొత్త వస్తువులను గుర్తుకు పెట్టుకోవడం కన్నా, ఒక ప్రాంతాన్ని లేదా ప్రదేశాన్ని సులభంగా గుర్తుకు పెట్టుకుంటామట, కాబట్టి మీరు గుర్తుకు పెట్టుకొవలనుకుంటున్న విషయాలను, మీకు తెలిసిన ప్రదేశంలో వుహించుకోవడం వలన, చాల సులభంగా ఆ విషయాలను, మీకు కావల్సినప్పడు గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఒక నాలుగు వస్తువులు గుర్తుకువుంచుకోవాలి అనుకుంటే... ఆ నాలుగు వస్తువులలో ఒకటి "బైక్ కీస్" అనుకుందాము...ముందుగా మీ ఇంటిలోకి వెళ్ళగానే మీకు కనపడేది...మీ సోఫా అనుకుందాము. అప్పుడు మీరు గుర్తుకు పెట్టుకొవలనుకుంటున్న ఆ "కీస్" ని, మీరు మీ ఇంటి సోఫా పైన పెట్టినట్టు ఉహించుకొండి, అలాగే మిగిలిన మూడు వస్తువులను మీ బెడ్ పైన ఒక వస్తువు, మీ కిచెన్ స్టవ్ దగ్గర మరో వస్తువు, ఇలా మీ ఇంటి నాలుగు ప్రదేశాల్లో, నాలుగు వస్తువులు పెట్టినట్టు ఉహించుకోవడం ద్వార ఈజీ గా మీకు కావలసినప్పుడు మీరు గుర్తుకు చేసుకోగలరు. ఎందుకంటే ఎప్పుడైన సరే .. మీ ఇంటిలోని సోఫా గుర్తుకు రాగానే.. ఆటోమేటిక్ గా బైక్ కీస్ గుర్తుకు వస్తాయి. అలాగే మిగిలిన అన్ని వస్తువులు కూడా. దీనినే మెమరీ పాలస్ అని కూడా అంటారు.

మూడవది......... సినిమాలోని ఓక సన్నివేశంలా మనసులో చిత్రికరించండి:

మీరు గుర్తుకు పెట్టుకొవలనుకుంటున్న విషయాన్నీ ఒక కెమెరా తో రికార్డు చేస్తున్నట్టు ఉహించుకోండి. ఎప్పుడైతే మీ మనసుతో మీకు కావాల్సిన విషయాలని, ఒక సినిమాలో సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు చూస్తారో, వాటిని చాల రోజులు గుర్తుకు పెట్టుకోగలరు. దీనినీ విజుల్ మెమరీ అంటాము. అందుకే పుస్తకంలో చదివిన వాటికైనా కూడా, మనం స్క్రీన్ పై చూసినవి ఎక్కువ రోజులు గుర్తుకు వుంటాయి. కాబట్టి మీరు గుర్తుకి పెట్టుకోవల్సినవన్ని మీ మనసనే కేమరాతో రికార్డు చేస్తున్నట్టు, స్పష్టంగా, జూమ్ చేసి, డిటైల్డ్గా చూడండి. అలా చూసినప్పుడు మీ బ్రెయిన్ లో రికార్డు చేసినట్టే నిలిచిపోతుంది.

నాలుగవది........ మొదటి అక్షరాలతో ఒక పదం తాయారుచేసుకోండి:

మీరు ఎవైన ముఖ్యమైన పాయింట్స్ గుర్తుకు పెట్టుకోవాలి అనుకుంటే...ఆ పాయింట్స్ యొక్క మొదటి అక్షరాలు తీసుకొని మరో కొత్త పదం తాయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఒక్క పదం గుర్తుకు పెట్టకుంటే...మిగిలిన అన్ని గుర్తుకు వస్తాయి. ఉదాహరణకి...మీకు మన పంచేంద్రియాలు అయిన చెవులు, నోరు, చర్మం, కళ్ళు, ముక్కు గుర్తుకు పెట్టుకోవాల్సివస్తే... వాటి ముందు అక్షరాలతో "చె.నో.చ.క.ము" అని గుర్తుకు పెట్టుకోవడం వలన ఆ ఐదు గుర్తుకు చేసుకోవచ్చు. దీనినే మ్నిమోనిక్స్ అని కూడా అంటారు.

ఐదవది.... ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకోండి:

ఒక ఆబ్జెక్ట్ లేదా ప్రదేశానికి మనం ఎమోషనల్ గా కనెక్ట్ కావటం వలన కూడా, మనకి ఆ విషయాలు బాగా గుర్తుకు ఉంటాయని పరిశోధనలు చెపుతున్నాయి, ఈ విషయములు MIT మరియు హార్వర్డ్ వారు చేసిన ఒక పరిశోదనలో, కొద్దిమందిని మెమరీ విషయంలో పరిశీలించినప్పుడు, వారు ఒక షేప్ యొక్క కలర్స్ గుర్తుకు పెట్టుకోవడం కన్నా, ఒక ఫోటోని వ్యక్తులని ఈజీ గా గుర్తుకి పెట్టుకుంటున్నారని తెలిపారు. కాబట్టి మీరు ఎ విషయమైతే గుర్తుకుపెట్టుకోవాలని అనుకుంటున్నారో, దానిని మీరు ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకొండి. ఆ విషయం మీ సంతోషాన్ని ఎలా పెంచుతుందో ఆలోచించండి. ఎ విషయమైన ఎమోషనల్ అవ్వగానే మనకి ఎక్కువ రోజులు గుర్తుకు వుంటుంది. అందుకే మనకి ఎప్పుడో జరిగిన అవమానాలైన, అభినందనలు అయిన మనం త్వరగా మరచిపోము కదా.

ఫ్రండ్స్ ! ఇలా మీరు ఈ ఐదు విషయాలను, మీకు కావాల్సిన సమాచారం విషయంలో ఆచరణలో పెట్టడం ద్వార మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు, అలాగే విజయాన్ని సాదించి గజని లా కాకుండా రోబో రజనిలా మారవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories