శ్రద్ధతో ఆడిపాడనున్న 'ఆర్ఎక్స్ 100' హీరో

శ్రద్ధతో ఆడిపాడనున్న ఆర్ఎక్స్ 100 హీరో
x
Highlights

ఈ మధ్యనే 'ఆర్ఎక్స్ 100' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న కార్తికేయ ప్రస్తుతం తన రెండవ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే....

ఈ మధ్యనే 'ఆర్ఎక్స్ 100' సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న కార్తికేయ ప్రస్తుతం తన రెండవ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 'హిప్పీ' అనే ఆసక్తికరమైన టైటిల్ తో విడుదల కానున్న ఈ చిత్రంలో కార్తికేయ ఒక కాసనోవా పాత్రలో కనిపించనున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ చూస్తే ఈ సినిమా ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందని, కామెడీ మరియు రొమాన్స్ తో నిండి ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో గ్లామర్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఈ సినిమాలో ఐటెం సాంగులో కనిపించబోతోందట. ఇది ఒక సంగీత్ సాంగ్ అని, ఇందులో కార్తికేయ, శ్రద్ధ దాస్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ అయిన దిగంగన సూర్యవంశీ తో డాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి టి.ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories