షాకింగ్ ఘటన..యూట్యూబ్‌లో చూసి.. ప్రాణాల మీదకు..

Submitted by arun on Thu, 07/26/2018 - 13:43
pregnant woman

యూట్యూబ్ లో ఇంట్లోనే ప్రసవాన్ని ఎలా చేసుకోవచ్చన్న వీడియోలను పదే పదే చూసిన ఓ జంట, ఆ సూచనలను పాటిస్తూ, ప్రసవానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి భార్య ప్రాణాలను బలిగొంది. తమిళనాడులోని తిరుపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరుపూర్‌లోని రత్నగిరీశ్వరనగర్‌కు చెందిన కృతిక(28) ఆమె ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కృతిక భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇంతకు ముందే మూడు సంవత్సరాల వయసున్న పాప ఉంది. ఈ దంపతులిద్దరూ ఇంటిలోనే యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ బిడ్డకు జన్మనివ్వాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కృతిక మరోసారి గర్భం దాల్చింది. డెలివరీ వేళ, ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలని భావించిన ఈ జంట, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో యూట్యూబ్ వీడియోలను చూశారు. తర్వాత నెలలు నిండి నొప్పులు ప్రారంభమైతే, తాము వీడియోలో చూసినట్టుగా చేశారు. అయితే, బిడ్డ పుట్టిన తరువాత కృతికకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో భయపడిన భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లే సరికే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, భర్తను అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు. కృతిక స్నేహితురాలు ఒకరు సహజ ప్రసవాలు చేస్తుండేదని, ఆమె సూచనతోనే ఈ పని చేశామని అతను చెప్పినట్టు సమాచారం.

youtube video baby delivery - woman dead

English Title
pregnant woman dies after giving birth by watching youtube video

MORE FROM AUTHOR

RELATED ARTICLES